Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అదానీ రగడ: పార్లమెంటు సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్, ఆప్ ఎంపీలు

బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు పార్లమెంటు సమావేశాలు బహిష్కరించారు. అదానీ వ్యవహారంపై జేపీసీ, సీజేఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు.

న్యూఢిల్లీ: వరుసగా రెండో రోజు కూడా బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు పార్లమెంటు సమావేశాలు బహిష్కరించారు. అదానీ వ్యవహారంపై జేపీసీ, సీజేఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు. ఉభయ సభల్లో బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాలను సభాపతులు తిరస్కరించారు. దీంతో నిరసన చేపట్టారు.

కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతోనే పార్లమెంటు సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్, ఆప్ ఎంపీలు తెలిపారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

BRS and AAP mps boycott parliament session: protest against adani and centre

బీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షనేత కే కేశవరావు, లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావుతో కలిసి ఎంపీలు సురేశ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, మాలోత్ కవిత, బీబీ పాటిల్ సహా ఇతర ఎంపీలు నిరసన తెలిపారు. అదానీ వ్యవహారంపై జేపీసీ లేదంటే సీజేఐతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు.

మరోవైపు, కాంగ్రెస్, టీఎంసీ సహా పార్టీలు కూడా అదానీ వ్యవహారంపై చర్చ జరగాలని, ప్రభుత్వం దీనిపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి. మంగళవారం పార్లమెంటులో రాహుల్ గాంధీ కూడా అదానీ వ్యవహారంపై కేంద్రాన్ని నిందించారు. అదానీ.. మోడీ స్నేహితుడని.. అందుకే అన్ని కాంట్రాక్టులు ఆ సంస్థకే వెళుతున్నాయని ఆరోపించారు.

BRS and AAP mps boycott parliament session: protest against adani and centre

కాగా, ఇటీవలమహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించిన బహిరంగ సభ, మీడియా సమావేశాల్లో బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్.. అదానీ వ్యవహారంపై ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. అదానీ వ్యవహారంతో దేశ ఆర్థిక వ్యవస్థ భారీగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అదానీకి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+