Telangana Assembly Elections 2023: ఆ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్..
బీఆర్ఎస్(BRS ) పెండింగ్ లో ఉన్న రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్ లోని గోషామహల్ నుంచి నందకిషోర్ వ్యాస్ కు టికెట్ ఇవ్వగా... నాంపల్లి నుంచి సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ కు టికెట్ కేటాయించింది. ఆనంద్ కుమార్ గౌడ్, నందకిషోర్ వ్యాస్ కు మంత్రి కేటీఆర్ బీ ఫామ్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల(Telangana Assembly Elections 2023) షెడ్యూల్ రాకముందే 115 మందితో మొదటి జాబితా విడుదల చేసింది.
జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్ స్థానాలను పెండింగ్ లో పెట్టింది. ఆ తర్వాత జనగామ నుంచి పల్లా రాజేశ్వర రెడ్డి పోటీకి దింపింది. ఇక నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డిని బరిలో నిలిపింది. ఈ రెండు స్థానాల్లో సిట్టింగ్ లు తమ స్థానాలను కోల్పోయారు. తాజాగా ప్రకటించిన 2 స్థానాలతో బీఆర్ఎస్ మొత్తం 119 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఎంఐఎంతో స్నేహపూర్వక పోటీలో ఉంది. అలంపూర్ అభ్యర్థిని మార్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై ఎలాంటి నిర్ణయం రాలేదు.

ఇటు కాంగ్రెస్ కూడా మొదటి జాబితాలో 55 మందిని ప్రకటించగా.. రెండో జాబితాలో 45 మందిని, మూడో జాబితాలో 16 మందిని ప్రకటించారు. కాంగ్రెస్ ఇంకా నాలుగు స్థానాలను పెండింగులో పెట్టింది. అయితే పొత్తులో భాగంగా రెండు స్థానాలు సీపీఐకి కేటాయించింది. ఇక మూడు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను కేటాయించాల్సి ఉంది. బీజేపీ ఇంకా 19 స్థానాలను పెండింగులో పెట్టింది. తెలంగాణలో బీజేపీ జనసేనతో కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications