Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేటీఆర్ ఇంటి వద్ద హైడ్రామా, ఉద్రిక్తత..!!

తెలంగాణ రాజకీయాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. కేటీఆర్ అరెస్ట్ వార్తలు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారుతున్నాయి. ఫార్ములా రేసు కేసులో కేటీఆర్ విచారణ కోసం ఇప్పటికే ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరింది. నిర్ణయం రాగానే చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ స్పష్టం చేసారు. ఇదే సమయంలో లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ప్రస్తావనతో అర్ద్రరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది.

అరెస్ట్ ప్రచారంతో
తెలంగాణ రాజకీయాలను కేటీఆర్ అరెస్ట్ తప్పదనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫార్ములా రేసు కోసం చేసిన చెల్లింపుల్లో కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం పైన విచారణ కోసం ఇప్పటికే ఏసీబీ గవర్నర్ అనుమతి కోరింది. అటు ఢిల్లీ పర్యటనలో రేవంత్ సైతం గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్ పైన చర్యలు ఉంటాయని స్పష్టం చేసారు. ఇదే సమయంలో లగచర్ల ఘటన చోటు చేసుకుంది. ఫార్మా కంపెనీ ఏర్పాటు పై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్ పైన దాడి జరగటంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.

BRS cade Gathers in huge at KTR house amid Arrest speculations

రిమాండ్ రిపోర్టులో
ఈ ఘటన పైన విచారణ చేసిన పోలీసులు పలువురిని అరెస్ట్ చేసారు. మరి కొందరిని విచారించి వదిలేసారు. ఈ ఘటన ఉద్దేశ పూర్వకంగా జరిగిందని పోలీసుల విచారణలో తేల్చారు. దీని వెనుక బీఆర్ఎస్ నేతలు ఉన్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేత సురేశ్ ఈ ఘటనలో ఏ 1గా పేర్కొన్నారు. ఘటనకు ముందు సురేశ్ తో మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి 42 సార్లు ఫోన్ చేయటంతో ఆయన ప్రమేయం పైన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే నరేంద్ర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఆయన రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ తో వరుస ఫోన్ సంభాషణలు గుర్తించారు. దీంతో, రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ ప్రస్తావన చేయటంతో, ఈ కేసులో ఆయన అరెస్ట్ తప్పదనే ప్రచారం మొదలైంది.

కేటీఆర్ కు మద్దతుగా
దీంతో, అర్ద్రరాత్రి నందినగర్ కేటీఆర్ ఇంటి వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. తెల్లవారు జామున 4 గంటల వరకు కార్యకర్తలు వస్తూనే ఉన్నారు. వారంతా కేటీఆర్ కు సంఘీభావం తెలిపారు. కేటీఆర్ ను అరెస్ట్ చేయాలంటే ముందుగా తమను ఎదుర్కోవాలంటూ నినదించారు. పోలీసులు వస్తారని.. కేటీఆర్ అరెస్ట్ ఖాయమని జరిగిన ప్రచారం తో అక్కడే కార్యకర్తలు ఉండిపోయారు. దీంతో, అటు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ కేసులో కేటీఆర్ ను పోలీసులు విచారిస్తారా.. లేక ఎలాంటి అడుగులు వేస్తారనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. అటు బీఆర్ఎస్ సైతం పోలీసుల నిర్ణయం ఏంటనేది వేచి చూస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+