Jubilee Hills: బీఆర్ఎస్ తొలి ఆధిక్యత - కౌంటింగ్ లో బిగ్ టర్న్..!!
జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితంలో కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లుగానే భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్ధి దాదాపు 8 వేల ఓట్లకు పైగా మెజార్టీతో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్, తొలి రెండు రౌండ్లలో కాంగ్రెస్ మెజార్టీ సాధించగా.. మూడో రౌండ్ లో బీఆర్ఎస్ కు తొలి ఆధిక్యత దక్కింది. నాలుగో రౌండ్ లో తిరిగి కాంగ్రెస్ పై చేయి సాధించింది. మరో ఆరు రౌండ్లు లెక్కించాల్సి ఉంది. బీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకుంటే మినహా కాంగ్రెస్ కు భారీ మెజార్టీ ఖాయంగా కనిపిస్తోంది.
జూబ్లీహిల్స్ కౌంటింగ్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. భారీ ఆధిక్యత దిశగా దూసుకువెళ్తోంది. మొత్తం పది రౌండ్లలో తుది ఫలితం వెల్లడి కానుంది. ఎంఐఎం కంచుకోటల్లోనూ బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది దీంతో, చివరి రౌండ్ వరకు ఉత్కంఠ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్-39, బీఆర్ఎస్ -36, బీజేపీ-10 ఓట్లు వచ్చాయి. ఈవీఎంల కౌటింగ్ లో ముందుగా షేక్‌పేట్ డివిజన్‌తో ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. కాగా, ఇక్కడా కాంగ్రెస్ అభ్యర్ధి స్వల్ప మెజార్టీతో కొనసాగుతున్నారు. తొలి రౌండ్ లో కాంగ్రెస్ కు 8,911 ఓట్లు బీఆర్ఎస్ కు 8,864 ఓట్లు వచ్చాయి.

కాగా.. రెండో రౌండ్ లో కాంగ్రెస్ కు 9,691 ఓట్లు రాగా, బీఆర్ఎస్ కు 8,609 ఓట్లు వచ్చాయి. దీంతో, రెండో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్ధి 1,144 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. షేక్ పేట ఎంఐఎంకు కంచుకోటగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ కు పూర్తి మద్దతు లభించింది. పోలింగ్ వేళ సరళి అదే స్పష్టం చేసింది. అయితే, బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇక.. మూడో రౌండ్ లో బీఆర్ఎస్ స్వల్ప మెజార్టీ సాధించింది. 211 ఓట్ల ఆధిక్యత దక్కించుకుంది. ఈ రౌండ్ లో బీఆర్ఎస్‌కు 12,503 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు 12,292 ఓట్లు వచ్చాయి. అదే విధంగా మూడో రౌండ్‌లో బీజేపీకి 401 ఓట్లు మాత్రమే దక్కాయి. కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ కు పూర్తిగా పట్టున్న రెహమత్ నగర్, ఎర్రగడ్డ, వెంగళ్‌రావు నగర్ ప్రాంతాలు ఈ రౌండ్ లో లెక్కించారు. దీంతో.. ఇక్కడ కాంగ్రెస్ భారీ మెజార్టీపై ఆశలు పెట్టుకుంది.
కాగా, నాలుగో రౌండ్ లోనూ కాంగ్రెస్ మెజార్టీ కొనసాగింది. ఈ రౌండ్ కౌంటింగ్ జరిగే ప్రాంతాలు నవీన్ యాదవ్ నివాసం ఉండే ఏరియా కావటంతో...ఇక్కడ ఊహించిన విధంగానే మూడు వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఫలితంగా ఇప్పటికే కాంగ్రెస్ మెజార్టీ 9,147 ఓట్లు. అయిదో రౌండ్ కౌంటింగ్ ప్రారంభమైంది. మరో అయిదు రౌండ్లు లెక్కించాల్సి ఉంది. కాంగ్రెస్ భారీ మెజార్టీతో జూబ్లీహిల్స్ లో గెలవటం లాంఛనంగా కనిపిస్తోంది.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం బంపరాఫర్ - తాజా గడువు, మార్గదర్శకాలు..!! -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్











Click it and Unblock the Notifications