ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీపార్టీలో ముసలం.. ఎమ్మెల్యే రేగా కాంతారావు షాకింగ్ వ్యాఖ్యల దుమారం!!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల మధ్య అంతర్గత యుద్ధం కొనసాగుతూనే ఉంది . ముఖ్యంగా పినపాకలో గులాబీ పాలిటిక్స్ కాక రేపుతున్నాయి. ఎన్నికల సంవత్సరం కావడంతో ఎస్టీ నియోజకవర్గంలో రంజుగా రాజకీయాలు మారుతున్నాయి. నేతల సంచలన వ్యాఖ్యలు అందుకు ఊతం ఇస్తున్నాయి. తాజాగా మరోమారు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.

భద్రాద్రి జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచిన రేగా సంచలన కామెంట్స్

భద్రాద్రి జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచిన రేగా సంచలన కామెంట్స్

తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవర్టుల యాక్షన్స్ నా దగ్గర చెల్లవు.. నేను ప్రజెంట్.. మాజీ ని కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రేగా కాంతారావు. ఆయన తన వ్యాఖ్యలతో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ను టార్గెట్ చేశారు. గతంలో కూడా పాయం వెంకటేశ్వర్లు ను టార్గెట్ చేసిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సొంత పార్టీలోనే శత్రువులు ఉన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పినపాక నియోజకవర్గం లో మనకు మాజీ ఎమ్మెల్యే తోనే పోటీ ఉంటుందని ఆయన గతంలోనే పేర్కొన్నారు.

పిల్లి పాలు తాగేటప్పుడు ఎవరు చూడట్లేదు అనుకుంటుంది.. నాకంతా తెలుసు

పిల్లి పాలు తాగేటప్పుడు ఎవరు చూడట్లేదు అనుకుంటుంది.. నాకంతా తెలుసు

ఇక తాజాగా మరోమారు పాయం వెంకటేశ్వర్లు ను టార్గెట్ చేసిన రేగా కాంతారావు అతి వినయం ధూర్త లక్షణం అంటూ మండిపడ్డారు. తాను ఏది గమనించలేనంత పరిస్థితిలో లేనని తేల్చి చెప్పారు. అన్ని పరీక్షిస్తున్నానని పేర్కొన్న ఆయన, పిల్లి పాలు తాగేటప్పుడు ఎవరు చూడట్లేదు అనుకుంటుందని, ఎవరెవరు ఎక్కడెక్కడ ఎవరెవరితో ప్రత్యక్షం అవుతున్నారో అంతా తనకు తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన దగ్గర యాక్టింగ్ పనిచేయదని పేర్కొన్న ఆయన, బీఆర్ఎస్ పార్టీలో కోవర్టులు ఉన్నారు జాగ్రత్త అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సైనికులు అప్రమత్తంగా, చాకచక్యంగా వ్యవహరించాలని రేగా కాంతారావు పిలుపునిచ్చారు.

రేగా వర్సెస్ పాయం వెంకటేశ్వర్లు ..

రేగా వర్సెస్ పాయం వెంకటేశ్వర్లు ..

పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన రేగా కాంతారావు గులాబీ పార్టీలో చేరి ప్రభుత్వ విప్ అయ్యారు. ఇక రేగా కాంతారావు చేతిలో ఓటమి పాలైన గులాబీ నేత పాయం వెంకటేశ్వర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పాయం వెంకటేశ్వర్లు వచ్చేఎన్నికలలో పోటీ చేయాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఇరువురి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. రేగా కాంతారావు నియోజక వర్గంలో ఆధిపత్యం చెలాయిస్తూ ఉండడంతో పాయం వెంకటేశ్వర్లు చాపకింద నీరులా పని చేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలోనే పాయం వెంకటేశ్వర్లు ను టార్గెట్ చేసిన రేగా కాంతారావు మరోమారు తాను ప్రజెంట్.. మాజీ ని కాను, ఆయనో కోవర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+