ఇదీ జరిగేది, సీఎం రేవంత్ పై హరీష్ కీలక వ్యాఖ్యలు..!!

మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి రేవంత్ కు సీఎం ప‌ద‌వి కేసీఆర్ పెట్టిన భిక్షగా పేర్కొన్నారు. బడ్జెట్ లేదని తెలిసినా కాంగ్రెస్ ప్రజలను ఆశపెట్టి మోసం చేసిందని ఆరోపించారు. క‌ర్నాటకలో 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 8 నెలలు దాటినా ఆ హామీలను అమలు చేయలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచే సరిస్థితి లేదన్నారు. ప్ర‌జ‌లు మ‌న‌ల్ని వెతుక్కుని ఓటు వేస్తార‌ని హ‌రీశ్‌రావు ధీమా వ్యక్తం చేసారు.

మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్..కాంగ్రెస్ ప్రభుత్వం పైన ధ్వజమెత్తారు. క‌ర్నాటకలో 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 8 నెలలు దాటినా ఆ హామీలను అమలు చేయలేదన్నారు. ఆరు నెలల దాటితే ఇక్క‌డ‌ స్థానిక ఎన్నికలు వస్తాయ‌ని చెప్పిన హరీష్.. అప్పుడు ప్ర‌జ‌లు మ‌న‌ల్ని వెతుక్కుని ఓటు వేస్తార‌ని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతుంటే అసహనంతో దాడులు చేస్తున్నారు. కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. మేం కేసులు పెట్టివుంటే సగం మంది కాంగ్రెస్ వాళ్లు జైళ్లలో ఉండేవారు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. పాలించడం చేతగాక ప్రతిపక్షాలను వేధిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉచిత కరెంట్ రావటం లేదన్నారు.

BRS leader Harish Rao made serious comments against CM Revanth at Medak

వంద రోజుల్లో హామీలు నెరవేర్చకపోతే ప్ర‌జ‌లు కర్రు కాల్చి వాతపెడతారు. రూ. 2 లక్షల రుణమాఫీ చేయకుండా పార్లమెంటు ఎన్నికలకు వెళ్తే ప్ర‌జ‌లు ఓటు వేయ‌రు. పార్లమెంటు ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ హామీలను నిలబెట్టుకుని చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. రైతుబంధు రూ. 15 వేలకు పెంచలేదన్నారు. పదివేలు కూడా సరిగ్గా రావడం లేదని చెప్పారు. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేయలేదని దుయ్యబట్టారు. పింఛన్ రూ. 4 వేలు పెరగలేదని చెప్పుకొచ్చారు. వడ్లకు బోనస్ పెరగలేదని.. అక్కాచెల్లెళ్లకు రూ. 2500 రాలేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా పింఛన్ పెంచలేదని ధ్వజమెత్తారు. రూ. 2 లక్షల రుణమాఫీ చేయకుండా పార్లమెంటు ఎన్నికలకు వెళ్తే ప్ర‌జ‌లు ఓటు వేయ‌రని కీలక వ్యాఖ్యలు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+