ఈడీ ఆఫీస్‌కు కేటీఆర్.. అనూహ్యంగా
Kalvakuntla Kavitha: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత విచారణను ఎదుర్కొంటోన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీలో ఉన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించింది.
ఈ కేసులో కవిత భర్త దేవనపల్లి అనిల్ కుమార్ కూడా ఈడీ రాడార్‌లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆయనకూ ఈడీ అధికారులు నోటీసులను జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఆయన సెల్ ఫోన్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అనిల్ కుమార్‌తో పాటు మరో నలుగులు తాజాగా ఈడీ నుంచి నోటీసులను అందుకున్న వారిలో ఉన్నారు. కవిత కార్యాలయంలో ప్రజా సంబంధాల అధికారిగా పని చేస్తోన్న రాజేష్, మరో ముగ్గురికి ఈ నోటీసులు అందాయి. ఈ అయిదుమంది కూడా సోమవారం ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.
అంతకంటే ముందే- బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈడీ అధికారుల రిమాండ్ కస్టడీలో ఉన్న కవితను కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారాయన. దేవనపల్లి అనిల్ కుమార్‌తో కలిసి కేటీఆర్ ఢిల్లీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈడీ కార్యాలయానికి మాత్రం కేటీఆర్ ఒక్కడే వచ్చారు.

ఈడీ కార్యలయానికి చేరుకున్న సమయంలో కేటీఆర్‌తో మాట్లాడటానికి మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు గానీ సాధ్యపడలేదు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఆసక్తి చూపలేదు. కారు దిగి నేరుగా మెయిన్ గేట్ గుండా ఈడీ కార్యాలయంలోనికి వెళ్లడం కనిపించింది.












Click it and Unblock the Notifications