కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రిటర్న్, అదే బాటలో..!!
తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్దం అవుతోంది. ఈ వారంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అటు బీఆర్ఎస్, బీజేపీ సైతం ఎన్నికలకు సై అంటున్నాయి. మంత్రులకు సీఎం రేవంత్ ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి తప్పు చేసానంటూ తాజాగా గులాబీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇదే విధంగా మరి కొందరు కాంగ్రెస్ కు దగ్గరైన వారు సైతం వెనక్కు వస్తున్నారనే చర్చ ఆసక్తి కరంగా మారుతోంది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. అధికార కాంగ్రెస్ వచ్చే నెలలో ఎన్నికల దిశగా సమాయత్తం అవుతోంది. మరో రెండు రోజుల్లో ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇదే సమయం లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి చేరారంటూ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు డిమాండ్ చేస్తూ
ఇచ్చిన ఫిర్యాదుల పైన విచారణ చేసిన స్పీకర్ ముగ్గురు మినహా మిగిలిన ఎమ్మెల్యేల పైన నిర్ణయం ప్రకటించారు. సుప్రీంకోర్టు సైతం ఆ ముగ్గురు పైన రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవా లని సూచించింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మహిపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గ ప్రయోజనాల దృష్ట్యా ఆ పార్టీలో చేరాల్సి వచ్చిందని చెప్పారు. దానితో వెంట్రుక మందం ప్రయోజనం జరగలేదని .. తప్పటడుగు వేశానని చెప్పుకొచ్చారు. కార్యకర్తలు, కుల సంఘాలు, కాలనీల సంఘాలతో ఆయన అంతర్గతంగా సమావేశమయ్యారు. కన్నతల్లిలా ఆదరించి మూడు సార్లు టికెట్ ఇచ్చిన బీఆర్‌ఎస్ ను మరవలేనని, పార్టీ నుంచి నిలబడిన అభ్యర్థుల గెలుపునకు తాను సైతం ప్రచారానికి వస్తానని పేర్కొన్నారు.
అందరం కలిసి కష్టపడదామని, అభ్యర్థుల గెలుపునకు కృషి చేద్దామని, ఇందుకు కార్మిక, కుల సంఘాలు, పెద్దలందరూ సహకరించాలని కోరారు. బీఆర్‌ఎస్ తరఫున నిలబడిన 104 మంది కౌన్సిలర్లను గెలిపించుకుందామని చెప్పారు. ఇందుకు కావాల్సిన వనరులు సమకూరుస్తామని తెలిపినట్టు సమాచారం. సాధ్యమైనంత వరకు సోదరుడు గూడెం మధుసూదన్‌రెడ్డి ప్రచారం చేస్తారని చెప్పిన ఎమ్మెల్యే.. తాను కూడా కలిసి పని చేస్తానని వెల్లడించారు.
అదే సమయంలో మరో ముగ్గురు ఎమ్మెల్యేల పైన స్పీకర్ నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. వీరిలో దానం, కడియం, సంజయ్ ఉన్నారు. దానం పైన అనర్హత వేటు తప్పదనే ప్రచారం వేళ.. రాజీనామాకు సిద్దం అవుతున్నారని పార్టీ నేతల సమాచారం. గ్రేటర్ ఎన్నికల సమయంలోనే జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ కు దగ్గరగా ఉంటున్న ఇద్దరు ఎమ్మెల్యేలు తిరిగి వెనక్కు వచ్చేందుకు సిద్దమయ్యారని పార్టీ నేతల సమాచారం. దీంతో.. మున్సిపల్ ఎన్నికల తరువాత గ్రేటర్ కేంద్రంగా రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.
-
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications