బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా పిటిషన్: హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశం
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై పోలీసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్లో 1.5 ఎకరాల భూమిని ఆక్రమించి అనురాగ్ ఇనిస్టిట్యూట్ సంస్థ(వర్సిటీ) అక్రమ నిర్మాణాలు చేపట్టిందంటూ ఇరిగేషన్ శాఖ ఏఈ పరమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ ఛైర్మన్‌గా పల్లా రాజేశ్వర్ రెడ్డిపై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనల మేరకు తమ సంస్థ నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ టీ వినోద్ కుమార్ హైకర్టు ధర్మాసనం.. చట్ట ప్రకారం ముందు కెళ్లాలని హైడ్రాను ఆదేశించింది. డాక్యుమెంట్లను సమగ్రంగా పరిశీలించి నిబంధనల ప్రకారం నడుచుకోవాలని స్పష్టం చేసింది.

బఫర్ జోన్లో వర్సిటీ కట్టారని ఫిర్యాదు: ఎమ్మెల్యే పల్లాపై కేసు
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. చెరువు బఫర్ జోన్లో రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీ నిర్మించారని ఇరిగేషన్ శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. మేడ్చల్ జిల్లాలోని వెంకటాపురం, నాధం చెరువుల బఫర్ జోన్లలో అనురాగ్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీ నిర్మించారని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇరిగేషన్ శాఖ అధికారుల ఫిర్యాదుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, హైదరాబాద్ నగర పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝలిపిస్తూన్న విషయం తెషయం తెలిసిందే. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో రూల్స్ కు విరుద్ధంగా నిర్మించారంటూ మాదాపూర్‌లో సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంట్‌ను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications