కాంగ్రెస్ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి: పార్టీ మార్పు ఖాయమేనా?

హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనూ కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరు కీలక నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంతటితో ఆగకుండా మరికొంతమంది నేతలను తమ పార్టీలో చేర్చుకునే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. సొంత పార్టీ నేతలు తిరిగి రావాలని ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా, నాగర్‌కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి హాజరుకావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అయితే, దామోదర్ రెడ్డి అటు అధికారిక పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లోనూ పాల్గొంటుండటం గమనార్హం.

BRS MLC Damodar reddy likely join Congress party soon

ఇటీవల గద్వాలలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ సభకు కూడా దామోదర్ హాజరయ్యారు. తాజాగా, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా బాధితులకు అందజేశారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడంతో దామోదర్ రెడ్డి ఆ పార్టీలో చేరతారన్న ప్రచారానికి బలం చేకూర్చింది. దామోదర్ రెడ్డితోపాటు ఆయన కుమారుడు రాజేశ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది.

దామోదర్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పార్టీకి మరింత బలం వస్తుందని శ్రేణులు భావిస్తున్నాయి. అయితే, నాగర్ కర్నూల్ అభ్యర్థిత్వంపై ధీమాగా ఉన్న మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డితో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఎడముఖం పెడముఖంగా ఉండటం కనిపించింది. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

కాగా, ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవిని దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్ రెడ్డి కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీలో చేరికపైనా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, మల్లు రవితో భేటీ అనంతరం దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. నాగం జనార్ధన్ రెడ్డితో మాట్లాడిన తర్వాత తన తుది నిర్ణయం ఉంటుందని చెప్పారు. నాగంతో తత్సంబంధాలే ఉన్నాయని.. అయితే, కొన్ని ఇబ్బందుల కారణంగా కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందని దామోదర్ రెడ్డి తెలిపారు.

తాను కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్లు పనిచేశానని దామోదర్ రెడ్డి తెలిపారు. తిరిగి సొంతగూటికి వస్తే ఎలా ఉంటుందని మల్లు రవితో చర్చించగా.. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ క్యాడర్‌తో తనకు కొన్ని ఇబ్బందులున్నాయన్నారు. ఆ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పుడు పార్టీ మార్పుపై తుది నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టం చేశారు దామోదర్ రెడ్డి. ఇక, దామోదర్ రెడ్డి వ్యవహారంపై బీఆర్ఎస్ అధిష్టానం స్పందించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+