ఢిల్లీలో కవిత- ఈడీ నోటీసుల నేపథ్యంలో..సస్పెన్స్!!
బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆమె ఈడీ విచారణను ఎదుర్కొంటోన్నారు. సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉంది.
హైదరాబాద్/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఇవ్వాళ దేశ రాజధానికి చేరుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు జారీ చేసిన నోటీసుల ప్రకారం- సోమవారం ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంది. విచారణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటీషన్ వేసిన నేపథ్యంలో- ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.
ఈడీ విచారణను నిలిపివేయాలని కోరుతూ కవిత ఇదివరకే సుప్రీంకోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. దీన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 24వ తేదీన లిస్టింగ్ చేసింది. ఈ విచారణను 18వ తేదీనాడే చేపట్టాలని కోరుతూ కవిత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె తరఫు న్యాయవాది వందన సెహగల్ ఈ మేరకు అర్జంట్ పిటీషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా దీనిపై విచారణ చేపట్టాలని మరోసారి అభ్యర్థించారు.

దీన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని, ముందుగా లిస్టింగ్ చేసినట్టే ఈ నెల 24వ తేదీ నాడే విచారిస్తామని స్పష్టం చేసింది. అదే సమయంలో ఈడీ అధికారులు కవితకు మరోసారి నోటీసులను పంపించారు. సోమవారం ఢిల్లీలోని తమ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలంటూ ఆదేశించారు. ఈ నేపథ్యంలో- ఈ సాయంత్రం కవిత ఢిల్లీకి చేరుకున్నారు. తుగ్లక్ రోడ్ లో ఉన్న కేసీఆర్ నివాసంలో బస చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ నెల 11వ తేదీన ఆమె తొలిసారిగా ఈడీ విచారణకు హాజరయ్యారు. సుమారు తొమ్మిది గంటల పాటు ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. రెండో విడతలో నోటీసులు ఇచ్చినప్పటికీ.. ఆమె హాజరు కాలేదు. తన తరఫు న్యాయవాదిని పంపించారు. ఈడీ విచారణకు హాజరుకాలేదు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున తాను హాజరుకాలేనని స్పష్టం చేశారు
దీనితో మూడోసారి ఆమెకు నోటీసులు ఇచ్చారు.












Click it and Unblock the Notifications