జైలు నుంచి కవిత విడుదల.. వడ్డీతో సహా చెల్లిస్తా అంటూ శపథం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. మంగళవారం రాత్రి జైలు నుంచి బయటకు రాగానే.. స్వాగతం పలకడానికి సిద్ధంగా భర్త, కుమారుడిని చూసి కవిత భావోద్వేగానికి లోనయ్యారు. వారిద్దరిని హత్తుకున్నారు. మరోవైపు తిహార్ జైలు వద్ద బాణాసంచా పేల్చి బీఆర్ఎస్ శ్రేణులు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఐదున్నర నెలల తర్వాత కవితకు ఉపశమనం లభించింది.
జైలు నుంచి కవిత విడుదల.. వడ్డీతో సహా చెల్లిస్తా అంటూ శపథం..!#Kavitha #KKavitha #SupremeCourt #DelhiLiquorPolicyCase #DelhiLiquorCase #Telangana #Oneindiatelugu pic.twitter.com/jTmIZXghfF
— oneindiatelugu (@oneindiatelugu) August 27, 2024
సుప్రీంకోర్టు బెయిల్ ఉత్తర్వులతో ఆమె తిహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఢిల్లీలో మీడియాతో బుధవారం మాట్లాడే సమయంలో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. నన్ను అన్యాయంగా జైల్లో పెట్టారని, దీనిపై వడ్డీతో సహా వారికి చెల్లిస్తానని ఆమె శపథం చేశారు. నేను కేసీఆర్ కూతురునని, తెలంగాణ బిడ్డనని నేను తప్పు చేసే ప్రసక్తే లేదని ఆమె చెప్పారు. తాను 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను, ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. కానీ వ్యక్తిగతంగా కుటుంబానికి ఐదున్నర నెలలు దూరంగా ఉండటం నాకు చాలా బాధ కలిగించిందని కవిత తెలిపారు.

నేను మొండిదాన్ని, మంచిదాన్ని నన్ను జగమొండిదాన్ని చేశారు. ఇప్పటి నుంచి ఇంకా బలంగా ప్రజాక్షేత్రంలో పని చేస్తామని కవిత పేర్కొన్నారు. కష్ట సమయంలో నాకు , మా కుటుంబానికి తోడుగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు కవిత కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం కవిత హైదరాబాద్‌కు పయనం అయ్యారు. రేపు మధ్యాహ్నం ఆమె హైదరాబాద్‌లో తన నివాసానికి చేరుకుంటారు. కవితకు బెయిల్ లభించడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications