లేఖ రాసింది నిజమే.. కేసీఆర్ దేవుడు కానీ..? - ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌కు రాసిన వ్యక్తిగత లేఖ లీక్ కావడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చిన కవితకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జాగృతి కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ సభ అనంతరం రెండు వారాల క్రితమే నా అభిప్రాయాలతో ఒక లేఖను కేసీఆర్‌కి పంపాను. లేఖ ఎలా బయటకు వచ్చిందో అర్థం కావడం లేదని, దీని వెనుక కుట్రలు, కోవర్టుల హస్తం ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. ఆ లేఖ పూర్తిగా అంతర్గత అంశాలపైనే ఉంది. ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేదు. కార్యకర్తల మనోభావాలను మాత్రమే వ్యక్తం చేశానని తెలిపారు.

కేసీఆర్ దేవుడు లాంటి వ్యక్తి.. కానీ ఆయన చుట్టూ కొందరు దెయ్యాలు ఉన్నారని తెలిపారు కవిత. ఇవే పార్టీకి హానికరమని.. నా లేఖ లీక్ అయిందంటే, పార్టీకి సంబంధించిన సాధారణ కార్యకర్తల పరిస్థితి ఏమిటో ఆలోచించాల్సిందేనని పేర్కొన్నారు. పార్టీలో లోపాలు ఉంటే వాటిని చర్చించుకోవాలి కానీ.. అంతర్గత విషయాలను లీక్ చేయడం సరైన పద్ధతి కాదన్నారు.
కేసీఆరే తమ నాయకుడని, ఆయన నాయకత్వంలోనే తామంతా పనిచేస్తామని కవిత పునరుద్ఘాటించారు. అయితే పార్టీలోని లోపాలను సవరించుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని తాను అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. పార్టీని ముందుకు తీసుకెళ్లే శక్తి ఆయనకే ఉంది అని కవిత మద్దతు తెలిపారు. చివరిగా కాంగ్రెస్, బీజేపీలు ఈ లేఖపై రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు.
కేసీఆర్ దేవుడు.. కానీ, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి - కవిత#KCR #Kavitha #KalvakuntlaKavitha #BRS #TGPolitics #PoliticsToday #Oneindiatelugu pic.twitter.com/lq2jYHqQP1
— oneindiatelugu (@oneindiatelugu) May 23, 2025












Click it and Unblock the Notifications