Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Padmarao Goud: 15 ఏళ్ల తర్వాత తన ఓటు తనకు వేసుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి..

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ 15 ఏళ్ల తర్వాత తన ఓటు తనకు వేసుకున్నారు. పద్మారావు గౌడ్, ఆయన కుటుంబ సభ్యుల ఓట్లు మోండా మార్కెట్ పరిధిలో ఉంటాయి. అయితే ఈ మోండా మార్కెట్ సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. దీంతో ఎమ్మెల్యే ఎన్నికల్లో పద్మారావు గౌడ్ కుటుంబ సభ్యులు సనత్ నగర్ అభ్యర్థిలకు ఓటు వేయాల్సి వచ్చేది.

అయితే పద్మారావు గౌడ్ ఈసారి ఎంపీ పోటీ చేస్తున్నారు. మోండా మార్కెట్ సికింద్రాబాద్ పరిధిలోకి వస్తుంది. దీంతో పద్మారావు గౌడ్, ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మోండా మార్కెట్ లోని ఇస్లామయి హైస్కూల్ లో ఓటు వేశారు. పద్మారావు గౌడ్ 2009లో తన ఓటు తనకే వేసుకున్నారు. అప్పుడు మోండా మార్కెట్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉండేది. 2009 నియోజకవర్గాల పునర్ వ్యవస్థికరణలో భాగంగా సనత్ నగర్ లోకి వెళ్లింది.

BRS MP candidate has cast his vote after 15 years

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పద్మారావు గౌడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పద్మా రావు గౌడ్ సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కేసీఆర్ ఆదేశాలతో ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కూడా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి ఎంపీగా పోటీ చేస్తున్నారు. సికింద్రాబాద్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న వారే పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి బరిలో నిలిచారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+