ఆ ఒపీనియన్ పోల్ బోగస్: కేటీఆర్ కారణమంటూ తెలంగాణ కాంగ్రెస్ ఫైర్

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార ఉధృతి పతాక స్థాయికి చేరుకుంటోంది. అన్ని పార్టీలు ఎన్నికల రణక్షేత్రంలో అమీ తుమీ తేల్చుకుంటోన్నాయి. భారత్ రాష్ట్ర సమితి సహా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకులు తెలంగాణలో మకాం వేశారు.

అదే సమయంలో సోషల్ మీడియా వేదికలపై ఎన్నికల సర్వేలు, ఒపీనియర్ పోల్స్.. ఇబ్బడి ముబ్బడిగా పోస్ట్ అవుతున్నాయి. విభిన్న అంచనాలను వ్యక్తం చేస్తోన్నాయి. కొన్ని సర్వే సంస్థలు.. బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతోండగా.. మరికొన్ని కాంగ్రెస్‌‌ అధికారంలోకి వస్తుందంటూ జోస్యం చెబుతున్నాయి.

BRS spreading false information, Telangana Congress

ఈ పరిస్థితుల్లో- రాజ్‌నీతి సర్వే సంస్థ తెలంగాణపై తాజాగా తన సర్వే నివేదికను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజాభిప్రాయాలతో రూపొందించిన రిపోర్ట్ అది. మొత్తంగా 38,351 మంది అభిప్రాయాలను సేకరించింది. వారి అభిప్రాయాలను క్రోడీకరించి ఈ నివేదికను తయారు చేసింది.

భారత్ రాష్ట్ర సమితి తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందని రాజ్‌నీతి ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందని అభిప్రాయపడింది. బీఆర్ఎస్‌కు 75 స్థానాలు లభిస్తాయని తెలిపింది. 42.43 శాతం ఓట్లు పోల్ అవుతాయని వివరించింది. కాంగ్రెస్‌కు 31 స్థానాలు లభిస్తాయని పేర్కొంది. 32. 62 శాతం వరకు ఓట్లు పడొచ్చని రాజ్‌నీతి అంచనా వేసింది.

ఈ సర్వే రిపోర్ట్‌ను రాజ్‌నీతి సంస్థ తోసిపుచ్చింది. ఇది తాము చేసిన సర్వే/ఒపీనియన్ పోల్ కాదని వివరించింది. ఈ మేరకు ఓ వీడియోను ఆ సంస్థ విడుదల చేసింది. ఈ వీడియో క్లిప్‌ను తెలంగాణ కాంగ్రెస్.. తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో విడుదల చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తాము ఎలాంటి సర్వేలు చేయలేదని స్పష్టం చేసింది. ఈ సర్వేను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.

రాజ్‌నీతి సంస్థ పేరు మీద వచ్చిన ఈ సర్వే పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ఏ సంస్థ అయినా నిజంగా సర్వే చేసివుంటే దాన్ని అధికారికంగా మీడియాకు విడుదల చేస్తుందని, తమ సంస్థ తరఫున అలాంటివేమీ జరగలేదని క్లారిటీ ఇచ్చింది. తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొందరు రాజ్‌నీతి పేరును ఇలాంటి బోగస్ సర్వేల కోసం వాడుకుంటోన్నారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+