ఎంతమంది పోటీ చేసినా జూబ్లీహిల్స్ లో గెలిచేది ఆ క్యాండేటే: లేటెస్ట్ షాకింగ్ రిపోర్ట్: కవిత ఫ్యాక్టర్?

Jubilee Hills bypoll: తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారింది. మూడు పార్టీలకూ అగ్నిపరీక్ష పెడుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ.. ఈ నియోజకవర్గంపై కన్నేశాయి. దీన్ని చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు.. అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఆశావహులు.. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ తో సమావేశాలు నిర్వహిస్తోన్నారు.

బీఆర్ఎస్ శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ కన్నుమూత వల్ల ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై కసరత్తు పూర్తి చేస్తోంది. దీనికి సంబంధించిన తేదీలను ఇదివరకే వెల్లడించింది.

BRS Takes the Lead Fresh Codemo Survey Shows Dominance in the Race in Jubilee Hills bypoll

ఈ పరిస్థితుల మధ్య కనెక్టింగ్ డెమోక్రసీ- టైమ్స్ నౌ ప్రత్యేకంగా సర్వే నిర్వహించాయి. దీని ప్రకారం.. బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనపర్చుతోంది. ఈ నియోజకవర్గంలో 42.8 శాతం మంది ఓటర్లు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్‌- 32.7, బీజేపీ- 19.5 శాతం ఓటర్ల మద్దతు కనిపించింది. బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య 10.1 శాతం తేడా ఉండటం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే.. బీఆర్ఎస్ తిరుగులేని మెజారిటీతో ఈ నియోజకవర్గాన్ని సొంతం చేసుకోవచ్చు.

నియోజకవర్గం పరిధిలో యువత, మహిళల మద్దతు బీఆర్ఎస్ ఉందని ఈ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ తో పోల్చుకుంటే 27.3 శాతం మంది 18-25 వయస్సు గల వారు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. వీరిలో 12.1 శాతం మహిళా ఓటర్లే. ఎస్సీ- 48.9, ఎస్టీ- 42, బీసీ- 43.4, మైనారిటీ- 46.5 శాతం ఓటుబ్యాంక్ కూడా గులాబీ పార్టీకే జై కొట్టింది. ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లల్లో అధికార కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపించింది.

అటు ముఖ్యమంత్రుల్లో కూడా జూబ్లీహిల్స్ ఓటర్ల ఫస్ట్ ఛాయిస్.. కేసీఆరే. ఆయనకు 46.5 శాతం మంది ఓటర్ల మద్దతు లభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న ఓటర్ల సంఖ్య 28.4 శాతం. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును 41.5 మంది ఓటర్లు వ్యతిరేకించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గ్రూప్-1 పరీక్షల అవకతవకలు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కొరత.. వంటి అంశాలు రేవంత్ సర్కార్ పై వ్యతిరేకతకు కారణం అయ్యాయి.

అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందనే అంశంపై 71.4 శాతం మంది ఓటర్లు మాగంటి గోపీనాథ్ కుటుంబం వైపు మొగ్గు చూపారు. ఆయన కుటుంబానికి చెందిన వాళ్లే పోటీ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆయన పనితీరు పట్ల సానుకూలంగా స్పందించారు వారంతా కూడా. మాగంటి గోపీనాథ్ భార్యకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ దిశగా కసరత్తు పూర్తయినట్లు సమాచారం.

ఈ ఎన్నిక బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు సవాల్. పార్టీ ఫిరాయింపులు, కవిత అసమ్మతి వంటి అంతర్గత సమస్యలతో సతమతమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ లో లభించే భారీ విజయం ఆయనకు ఊరట ఇస్తుందని మెజారిటీ ఓటర్లు అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+