నేడు బీఆర్‌ఎస్‌ లో భారీ చేరికలు -కేసీఆర్ తో వరుస భేటీలు..!!

బీఆర్ఎస్ లో ముఖ్య నేతల చేరికలకు రంగం సిద్దమైంది. ప్రముఖులతో కేసీఆర్ వరుస సమావేశాలు కొనసాగుతున్నాయి.

ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి చేరికల పై గులాబీ నేతలు ఫోకస్ పెట్టారు. నేరువగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తన లక్ష్యాలను వివరిస్తున్నారు. వారికి తన పార్టీలో దక్కే ప్రాధాన్యతను వివరిస్తున్నారు. ముందుగా పొరుగు రాష్ట్రాల నుంచి చేరికలను పెంచేలా వ్యూహం అమలు చేస్తున్నారు. అదే సమయంలో ఆ రాష్ట్రాల్లో ప్రజలను ఆకట్టుకొనేలా తమ విధానాలను స్పష్టం చేయటానికి సిద్దమయ్యారు. ఈ రోజు తెలంగాణ దాటి మహారాష్ట్రలో బీఆర్ఎస్ తొలి సభ జరగనుంది. ఈ సభ పైన రాజకీయంగా ఆసక్తి కనిపిస్తోంది.

నేడు నాందేడ్ లో బీఆర్ఎస్ సభ..

నేడు నాందేడ్ లో బీఆర్ఎస్ సభ..


జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ఆవిర్భవించిన తరువాత రెండో సభ మహారాష్ట్రలో జరగనుంది. ఈ రోజు నాందేడ్ లో జరిగే సభను పార్టీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మధ్నాహ్నం కేసీఆర్ నాందేడ్ చేరుకోనున్నారు. నిర్వహించనున్న ఈ సభ కోసం సర్వం సిద్ధం చేశారు. నాందేడ్‌ పట్టణంతో పాటు.. సభాస్థలికి నలుదిక్కులా కిలోమీటర్ల మేర ఆ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వారం రోజులుగా అక్కడే ఉంటూ ఇతర నేతలతో సమన్వయం చేసుకుంటూ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దులోని తెలంగాణకు చెందిన ఆదిలాబాద్‌, బోథ్‌, ముధోల్‌, బోధన్‌, నిర్మల్‌, నిజామాబాద్‌ నియోజకవర్గాల నుంచి కూడా జనాన్ని సమీకరించేందుకు చర్యలు చేపట్టారు. నాందేడ్‌ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వచ్చేలా ఏర్పాట్లు చేసారు.
2

బీఆర్ఎస్ లో భారీ చేరికలు..

బీఆర్ఎస్ లో భారీ చేరికలు..


ముందుగా పొరుగు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ పైన ఫోకస్ పెట్టిన కేసీఆర్ పలువురితో చర్చలు ప్రారంభించారు. ఈ రోజు జరిగే నాందేడ్ సభలో మహారాష్ట్రకు చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు పెద్దఎత్తున గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. మహారాష్ట్ర- చత్తీస్ ఘడ్ కు చెందిన పలువురు నేతలు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. వారిలో.. మహారాష్ట్ర బండారా మాజీ ఎంపీ కుషా ల్‌ భోప్చే, గడ్చిరోలి జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ పసుల సమ్మయ్యపోచమ, రిపబ్లికన్‌ పార్టీ గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ శంకర్‌ తదితరులున్నారు. అదేవిధంగా ఛత్తీస్ గఢ్‌కు చెందిన నేషనల్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు గోపాల్‌ రిషికార్‌ భారతి, మాజీ మంత్రి డాక్టర్‌ చబ్బీలాల్‌ రాత్రే, మధ్యప్రదేశ్‌ బాలాఘాట్‌ మాజీ ఎంపీ బోధ్‌సింగ్‌భగత్‌ తదితరులు ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయిన వారిలో ఉన్నారు. తెలంగాణలో రైతుబంధు, దళిత బంధు, ఉచితవిద్యుత్తు, వంటి పథకాల అమలు గురించి ఈ సందర్భంగా వారు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు వారు ఆసక్తిగా చూపించారు.

జాతీయ విధానం పై క్లారిటీ..

జాతీయ విధానం పై క్లారిటీ..


ఈ రోజు ప్రగతి భవన్ లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. రేపు (సోమవారం) తెలంగాణ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో ఈ బడ్జెట్ కు ఆమోద ముద్ర వేయనున్నారు. ఆ తరువాత ప్రత్యేక విమానంలో కేసీఆర్ నాందేడ్ బయల్దేరుతారు. అక్కడ ముందుగా ఛత్రపతి శివాజీ విగ్రహానికి నివాళి అర్పిస్తారు. ఆ తరువాత సభ స్థలికి చేరుకుంటారు. అక్కడ పార్టీలో పలువురు నేతలు చేరనున్నారు. తరువాత కేసీఆర్ ప్రసంగం దాదాపు గంట సేపు కొనసాగనుంది. సభ ముగిసిన తరువాత కేసీఆర్ నాందేడ్ లో జరిగే ప్రెస్ మీట్ లో పాల్గొంటారు. మహారాష్ట్రలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు.. జాతీయ రాజకీయాలు.. మహారాష్ట్రలో తమ పార్టీ వైఖరి..విధి విధానాల పైన కేసీఆర స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణ బయట జరుగుతున్న బీఆర్ఎస్ తొలి సభ కావటంతో.. ఈ బహిరంగ సభ పైన ఆసక్తి కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+