ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని అధికార బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకన్నారు.
హైదరాబాద్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని అధికార బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకన్నారు. మిత్రపక్షమైన మజ్లిస్ చేసిన అభ్యర్థన మేరకు మద్దతు ప్రకటిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
పార్టీలోని సీనియర్లతో చర్చించిన అనంతరం హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మజ్లిస్ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి పలు సందర్భాల్లో ఎంఐఎం కూడా మద్దతుగా నిలిచిన నేపథ్యలోనే బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రెహమత్ బేగ్‌ను ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు.

ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి నెల 13వ తేదీన హైదరాబాద్ స్థానిక సంస్థల స్థానంతో పాటు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications