రిటైరైనా గుంజుకొచ్చి, వదిలేది లేదు- కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య రాజకీయం హోరాహోరీగా సాగుతోంది. బీజేపీ కొత్త వ్యూహాలతో తెలంగాణలో బలపడలమే లక్ష్యం గా అడుగులు వేస్తోంది. పార్టీ అధినాయకత్వం తెలంగాణ పైన గురి పెట్టింది. బీఆర్ఎస్ - కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లు తాపక స్థాయికి చేరాయి. తాజాగా కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ కీలక హెచ్చరిక చేసారు. తమ పార్టీ కార్యకర్తలను వేధించిన వారిని వదిలేది లేదని తేల్చి చెప్పారు.
బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వారిని వదిలిపెట్టేది లేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నవారిని ఒక్కరిని కూడా వదలమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వంలోని పెద్దల మెప్పు కోసం కొందరు అధికారులు అతి చేస్తున్నారని మండిపడ్డారు. వారు తరువాత సర్వీసులో ఉన్నా.. రిటైర్డ్ అయినా..గుంజుకొచ్చి ప్రజల ముందు నిలబెడతామని అన్నారు. బీఆర్ఎస్ నాయకులను క్షోభ పెడితే వదిలిపెట్టమని పేర్కొన్నారు. తాను కేసీఆర్‌లా మంచోడిని కాదని, ఇకనైనా పద్ధతి మార్చుకోవాలంటూ మంచిర్యాల ఎమ్మెల్యేకు సూచించారు. తెలంగాణలో కరువు రావొద్దనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని గుర్తు చేశారు.

పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తాం
కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాల్సిన ఎల్ అండ్ టీ సంస్థను కూడా బెదిరించారని కేటీఆర్ ఆరోపించారు. గోదావరి నది ఏపీకి తరలుతోంది.. అక్కడ పట్టిసీమ పారుతోందని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలిసింది ఒకటి ఓట్లు, రెండోది తిట్లు అని వ్యంగ్యాస్త్రం సంధించారు. ఏం జాతి మీది అని సీఎం రేవంత్ రెడ్డి తరచూ అంటున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో ఉన్నవి రెండే జాతులని వివరించారు. ఒకటి తెలంగాణను ప్రేమించే జాతి.. రెండోది ద్వేషించే జాతి అని కేటీఆర్ స్పష్టం చేశారు. 31 నెలలుగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మరమ్మతులు చేయలేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు.












Click it and Unblock the Notifications