వదినపై అత్యాచారయత్నం: కేకలు వేయడంతో గొంతు నులిమి హత్య

హైదరాబాద్: కరీంనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. సొంత వదినపై అత్యాచారానికి యత్నించిన ఓ వ్యక్తి, ఆమె ప్రతి ఘటించడంతో చివరకు గొంతు నులిమి హత్య చేసిన సంఘటన జిల్లాలోని కాటారం మండలం చింతకాని గ్రామంలో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం చింతకాని గ్రామానికి చెందిన చీరాల పోచం(44) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి బాగా మద్యం సేవించి పక్కనే ఉన్న వదిన చీరాల లచ్చక్క(45) ఇంట్లోకి వెళ్లి ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.

దాంతో ఆమె ప్రతి ఘటించి పెద్దగా కేకలు వేసింది. తన బుద్ధి ఎక్కడ బయడిపోతుందనే ఉద్దేశ్యంతో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఆదివారం ఉదయం ఆమె మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

brutal murder in karimnagar district

ఒంటరిగా ఉన్న బాలికపై మెకానిక్ అత్యాచారయత్నం

ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారయత్నం చేసిన ఓ మెకానిక్‌కు స్ధానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం కృష్ణానగర్‌కు చెందిన మహేష్ మెకానిక్ షాపు నిర్వహిస్తున్నాడు.

ఆరు నెలల క్రితం బీటెక్ చదివిన ఓ యువతిని పోలీసుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. శనివారం ఉదయం తన ఇంటికి సమీపంలో ఓ ఇంట్లో బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన అతడు ఆ ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారయత్నం చేశాడు.

బాలిక బిగ్గరగా కేకలు వేయడంతో స్థానిక మహిళలు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి జూబ్లిహిల్స్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+