పవన్ కళ్యాణ్‌తో బీఎస్పీ నేతల భేటీ, రామకృష్ణపై జనసేనాని ప్రశంస

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) నేతలు మంగళవారం కలిశారు. జనసేన పార్టీ కార్యాలయంలో వారు భేటీ అయ్యారు.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీఎస్పీ రాజ్యసభ సభ్యులు వీర్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు బీఎస్పీ ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల సమన్వయకర్త గౌరీప్రసాద్, బీఎస్పీ తెలంగాణ విభాగం నేత బాలయ్యలు కలిసిన వారిలో ఉన్నారు.

BSP leaders meet Pawan Kalyan

ఈ సందర్భంగా వారి మధ్య ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పేర్కొన్న అంశాల అమలులో జాప్యం, రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలపై చర్చించారు.

BSP leaders meet Pawan Kalyan

రామకృష్ణకు అభినందనలు

సీపీఐ ఏపీ శాఖ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రామకృష్ణకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కార్యవర్గానికి ఎన్నికయిన ఇతర సభ్యులకు కూడా శుభాభినందనలు తెలిపారు.

రామకృష్ణ నేతృత్వంలో సీపీఐ అనేక ప్రజా సమస్యలను ఏపీలో పరిష్కరిస్తుందని ఆశిస్తున్నానని, ప్రజా సమస్యల పరిష్కారంలో జనసేన తనవంతు సహకారం అందిస్తుందని మరోసారి హామీ ఇస్తున్నానని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BSP leaders meet Jana Sena chief Pawan Kalyan on Tuesday evening at Jana Sena office.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి