Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బిటెక్ విద్యార్థిని దేవి మృతి ఇంకా మిస్టరీనే: ఆ 20 నిమిషాల్లో ఏమైంది?

హైదరాబాద్: బిటెక్ విద్యార్థిని దేవి మృతి కేసు మిస్టరీ వీడడం లేదు. కారు ప్రమాదంలో ఆమె చనిపోయిందని చెబుతున్నప్పటికీ అనుమానాలు కలిగించే పలు ప్రశ్నలకు సమాధానాలు లభించడం లేదు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో జరిగిన సాధారణ రోడ్డు ప్రమాదంగా భావించి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు పలు ట్విస్టులు ఎదురవుతున్నాయి.

కుటుంబసభ్యులు లేవనెత్తిన అనుమానాలు, సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రాము చెప్పిన అంశాలతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రాథమిక విచారణలో పలు అంశాలపై దృష్టిసారించారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన సమయంలో అనేక కొత్త విషయాలను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది.

రోడ్డు ప్రమాదంగా భావించి వదిలేసిన పోలీసులు భరత్‌ను బుధవారం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మద్యం తాగి డ్రైవ్ చేయడంతో ప్రమాదం జరిగిందని ముందు ప్రకటించిన పోలీసులు వాచ్‌మెన్ చెప్పిన అంశాలను సైతం స్టేట్‌మెంట్ రూపంలో సేకరించారు.

BTech girl student Devi's death still a mystery

దేవి తల్లిదండ్రులు లిఖితపూర్వకంగా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేసి, హత్య కోణంలో విచారించాలని కోరడంతో పోలీసులు భరత్‌ను ప్రశ్నించినట్టు తెలిసింది. పబ్ నుంచి ప్రమాదంవరకు ఏమేం జరిగిందనే విషయాలను రాబట్టడానికి భరత్‌ను అధికారులు ప్రశ్నలతో ముంచెత్తినట్లు తెలుస్తోంది.

దేవి మృతి కేసులో ఆరోపణలెదుర్కుంటున్న సామ భరత్‌సింహారెడ్డి ముందునుంచి వివాదాస్పదుడేనని పోలీసులు చెప్తున్నారు. గతంలో జూబ్లీహిల్స్ పరిధిలోని ఓ పబ్‌లో తాగి, సిబ్బందితో గొడవపడ్డాడని, ఏడాదిన్నర క్రితం జూబ్లీహిల్స్ క్లబ్ పరిసరాల్లో మద్యం మత్తులో బీరు బాటిళ్లలో కొట్టుకున్న వ్యవహారంకూడా ఉందని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో అప్పట్లో కేసు కూడా నమోదు చేశామని తెలిపారు.

మీడియాలో వచ్చిన కథనాల సారాంశం ఇలా ఉంది - శనివారం రాత్రి ఓ హోటల్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాదాపూర్ వెళ్లి, తిరిగివచ్చే సమయంలో దేవిని తన కారులో దింపుతానని ఆమె స్నేహితురాలు బయలుదేరబోయింది. అక్కడే ఉన్న భరత్‌సింహారెడ్డి, మరో ఇద్దరు తాము దింపుతామని చెప్పి కారులో ఎక్కించుకున్నారని ఆ స్నేహితురాలు చెప్పింది.

BTech girl student Devi's death still a mystery

షేక్‌పేట్ దర్గానుంచి ప్రశాసన్‌నగర్ వరకు దేవి ప్రయాణం సాఫీగానే సాగినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 70లోకి ప్రవేశించి, ఆంధ్రజ్యోతి దినపత్రిక కార్యాలయం సమీపంలోకి రాగానే తన తండ్రి నిరంజన్‌రెడ్డి నుంచి దేవికి ఫోన్ వచ్చింది. డాడీ.. రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటా.. ఆల్ మోస్ట్ రీచ్ అయ్యాను.. అని చెప్పి ఫోన్ పెట్టేసింది.

ఆంధ్రజ్యోతి ఆఫీస్‌నుంచి దేవి తన ఇంటికి కారులో చేరుకోడానికి రెండు నిమిషాలు కూడా పట్టదు. దేవీ ఇంటికి సరిగ్గా 200 మీటర్ల ముందున్న ఏబీపీ సొల్యూషన్ భవనంనుంచి ఎడమవైపు నిర్మానుష్య ప్రాంతం ఉంది. కారు దారి మళ్లించిన 3.24 గంటలనుంచి ప్రమాదం జరిగిందని చెప్తున్న 4.36 గంటల వరకూ దేవి ఆ కారులో ఉన్నవారిచేతిలో నరకం అనుభవించిందా అనేది ప్రస్తుతానికి సమాధానం దొరకని ప్రశ్నగానే ఉంది.

డెడ్‌ఎండ్‌లో ఉన్న ఓ ఇంటి వాచ్‌మెన్ దేవి ఉన్న కారును 3.30 గంటలకు చూసినట్టు చెప్తున్నాడు. 4.10వరకు కారులోనుంచి అరుపులు, కేకలు, రక్షించండి అంటూ ఆర్తనాదాలు వినిపించాయని పోలీసులకు సైతం స్టేట్‌మెంట్ ఇచ్చాడు. 4.10 తర్వాత కారు అక్కడి నుంచి వెళ్లిపోయిందని పోలీసులు సైతం గుర్తించినట్టు తెలిసింది.

కానీ ప్రమాదం జరిగింది మాత్రం 4.30గంటలకు. మరీ మధ్యలో 20 నిమిషాలు కారు ఎక్కడి వెళ్లింది? దేవిని కారులో ఎక్కడికి తీసుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్లారు? అన్నది పోలీసుల దర్యాప్తులో బయటపడాల్సి ఉంది. దేవి ముందు సీట్లో కూర్చుందని ఒకసారి, వెనుక కూర్చుందని ఒకసారి భరత్ చెప్పడంపైనా పోలీసులు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.

BTech girl student Devi's death still a mystery

ఘటనా స్థలిని విశ్లేషించిన పోలీసులు దేవి కారులోని కుడి వైపు ఉన్న వెనుక డోర్ నుంచి కిందపడి ఉన్నదని గుర్తించారు. అయితే 20 నిమిషాల్లోనే ఎందుకు వెనక్కు వచ్చారు? దేవి ప్రతిఘటనకు.. కారు వెనక్కు రావడానికి లింకుందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలా సీన్ క్రియేట్ చేసేందుకు 20 నిమిషాలు సమయం తీసుకొని ఉంటారా? అన్నది ఇప్పుడు పోలీసుల మదిని తొలుస్తున్న ప్రశ్న. ఒకవేళ డెడ్ ఎండ్ రోడ్‌లోనే లైంగిక దాడిలో దేవి మృతిచెంది ఉంటుందా? అందుకే రోడ్డు ప్రమాదం జరిగినట్టు సీన్ క్రియేట్ చేశారా? అన్నది తేలాల్సి ఉంది.

పైగా అది డెడ్ ఎండ్. ఆ రోడ్డులోకి భరత్ కారుమళ్లించినట్టు సమాచారం. దీనితో దేవి తన తండ్రికి ఫోన్‌చేసింది. నిరంజన్‌రెడ్డి కాల్ లిఫ్ట్‌చేసేలోపు కాల్ కట్ అయ్యింది. నిరంజన్‌రెడ్డి మళ్లీ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఆ పై ప్రమాదం జరిగిన సమయం 4.30 గంటల వరకు నిరంజన్‌రెడ్డి తన కూతురికి ఫోన్ చేస్తూనే ఉన్నారు.

ప్రమాదం జరిగినట్టు చెప్తున్న ప్రదేశంలో దేవి ఫోన్ మోగుతుండటంతో ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ 4.36 గంటలకు ఫోన్ ఎత్తి ప్రమాదం గురించి చెప్పినట్టు నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంలో ఓ బడా పారిశ్రామికవేత్త తనయుడి పాత్ర కూడా ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దేవి కేసు ఛేదించడదానికి రంగంలోకి టాస్క్‌ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగారు. ప్రమాద స్థలిని పరిశీలించిన అధికారులు మాదాపూర్‌లోని పబ్, ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించినట్టు తెలిసింది. నిపుణుల సహాయంతో ఫుటేజ్‌ను విశ్లేషిస్తున్నామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

దేవి, భరత్‌ల ఫోన్ల కాల్‌డాటాలను సైతం సేకరిస్తున్నామని చెప్పారు. కారులో భరత్, దేవి కాకుండా మరెవరైనా ఉన్నా సెల్ ఫోన్ సిగ్నల్‌ద్వారా తెలిసిపోతుందని, కేసును ఎట్టిపరిస్థితుల్లో ఛేదిస్తామని ఆయన స్పష్టంచేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+