కాపురం చేయాలని భర్త హింసించాడు, పురుగుల మందు తాగించి చంపేశారు

నల్లగొండ : నల్లగొండ జిల్లా నక్రేకల్ మండలం నోముల గ్రామంలో జరిగిన బిటెక్ విద్యార్థిని ఝాన్సీది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. ఫేర్‌వేల్ పార్టీ అయిపోయిన తర్వాత వస్తానని చెప్పినా వినకుండా బలవంతంగా కాలేజీ నుంచి తీసుకుని వచ్చారని, తనతో కాపురం చేయాలని భర్త విజయేందర్ రెడ్డి ఝాన్సీని హింసించాడని, ఆమె లొంగకపోవడంతో తల్లి పద్మతో కలిసి విజయేందర్ రెడ్డి పురుగుల మందు ఇచ్చి చంపేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

ఝాన్సీ భర్త విజయేందర్‌రెడ్డి, కన్నతల్లి గుర్రపు పద్మ హత్య చేయగా, ఝాన్సీ అన్న శివశంకర్‌రెడ్డి, ఆమె అత్త మామలు జయమ్మ, జానకిరాంరెడ్డి, మరిది అజయేందర్‌రెడ్డిలతోపాటు కారు డ్రైవర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఈ హత్యలో పరోక్షంగా భాగం పంచుకున్నారని పోలీసులు చెప్పారు. ఈ ఏడుగురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారంనాడు వీరందరినీ కోర్టులో హాజరు పర్చి రిమాండ్‌కు పంపించనున్నారు.

BTech student Jhansi killed by family members

డీఎస్పీ ఎస్‌.సుధాకర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఝాన్సీరాణి హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌ విద్యనభ్యసిస్తూ బాలికల హాస్టల్‌లో ఉంటుంది. గత నెల 23న ఝాన్సీ భర్త విజయేందర్‌రెడ్డి హైదరాబాద్‌కు వెళ్లి ఆమెను నకిరేకల్‌కు తీసుకువచ్చాడు. మరుసటి రోజు 24వ తేదీన తనతో కాపురం చేయాలంటూ భర్త ఝాన్సీని తీవ్ర హింసకు గురి చేశాడు.

ఈ గొడవ జరుగుతున్న సమయంలో తల్లి కూడా అక్కడే ఉంది. గొడవ తీవ్ర స్థాయికి చేరిన సమయంలో ఆగ్రహంతో భర్త విజయేందర్‌, తల్లి గుర్రపు పద్మ కలిసి ఝాన్సీకి బలవంతంగా పురుగులమందు తాగించారు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని నమ్మబలికి మృతదేహాన్ని కారులో నల్లగొండ మండలం దీపకుంట గ్రామానికి తీసుకుని వెళ్లి దహనం చేశారు.

ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం చదివేటప్పుడు 2014 సంవత్సరంలో ఝాన్సీరాణికి విజయేందర్‌రెడ్డితో వివాహమైంది. ఝాన్సీరాణి తల్లి గుర్రపు పద్మ విజయేందర్‌రెడ్డి తండ్రి జానకిరాంరెడ్డి వద్ద రూ.4 లక్షలను అప్పుగా తీసుకుంది. ఈ అప్పు తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో విజయేందర్‌రెడ్డి ఒత్తిడి మేరకు ఝాన్సీరాణికి ఇష్టంలేని పెళ్లి జరిపించారు. వివాహం అనంతరం విజయేందర్‌రెడ్డి ఝాన్సీని శారీరకంగా వేధించడం ప్రారంభించాడదు.

ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌ అయ్యే వరకు తనను శారీరకంగా ఇబ్బందులకు గురి చేయవద్దంటూ ఝాన్సీ వేడుకుంది. అయితే అప్పటి నుంచి వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతూ వస్తున్నాయి. గత నెల 23న ఫైనలియర్‌ పరీక్షలు పూర్తి కాగానే ఫేర్‌వెల్‌ పార్టీ చూసుకుని ఊరికి వస్తానని చెప్పినా వినకుండా విజయేందర్‌రెడ్డి బలవంతంగా ఝాన్సీని ఇంటికి తీసుకుని వచ్చి దాడికి ప్రయత్నించాడు. అయితే ఆమె తిరస్కరించింది.

దీంతో విజయేందర్‌రెడ్డి ఝాన్సీని హతమార్చాలని నిర్ణయానికి వచ్చి ఆమె తల్లి వద్ద రూ.120 తీసుకుని మార్కెట్‌కు వెళ్ళి బాలాజీ ఫర్టిలైజర్స్‌ షాప్‌లో మోనోక్రోటోఫాస్‌ మందును కొనుగోలు చేశాడు. 24వ తేదీన సాయంత్రం 4 గంటలకు భర్తతోపాటు తల్లి ఝాన్సీ నోటీలో బలవంతంగా పురుగులమందు పోశారు. దీంతో ఆమె ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ఆ తర్వాత భర్త, తల్లి కలిసి ఝాన్సీ మృతదేహాన్ని దీపకుంట గ్రామానికి తీసుకెళ్ళి ఎవరికీ తెలియకుండా సాక్ష్యాలు లేకుండా చూసి 25వ తేదీన దహనం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+