దూసుకొచ్చిన ఎద్దు: తప్పించుకోబోయి గాయపడ్డ ఉత్తమ్..
శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా చింతలపాలెంలో నిర్వహించిన ఎడ్ల పందేల్లో ఉత్తమ్ కుమార్ పాల్గొన్నారు.
నల్గొండ: సందడి చేద్దామని ఎడ్ల పందేలకు వెళ్తే వ్యవహారం బెడిసికొట్టి తృటిలో ప్రమాదం తప్పింది. అనుకోని ఘటనతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ హతాశయులయ్యారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నక్కగూడెంలో నిర్వహించిన ఎడ్ల పందేల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా చింతలపాలెంలో నిర్వహించిన ఎడ్ల పందేల్లో ఉత్తమ్ కుమార్ పాల్గొన్నారు. జనం తాకిడి ఎక్కువవడంతో ఎడ్లు బెదిరిపోయి పరుగందుకున్నాయి. ఈ క్రమంలో ఒక ఎద్దు ఉత్తమ్ కుమార్ వైపు దూసుకొచ్చింది. ఎద్దును తప్పించుకునేందుకు పరుగు తీసిన ఉత్తమ్ కుమార్ స్వల్ప గాయాలపాలైనట్లు సమాచారం. ఎడ్ల పందేలను తిలకించడానికి వచ్చిన పలువురు గ్రామస్తులు సైతం గాయపడినట్లు తెలుస్తోంది.













Click it and Unblock the Notifications