ముందస్తు చర్య: మంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్నకు తెలంగాణ ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న మారుమూల గిరిజన ప్రాంతాల్లో మంత్రి పర్యటించాల్సి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఇటీవల కాలంలో రెండు సార్లు మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఆదిలాబాద్ జిల్లాలో ఎదురు కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. మంత్రి జోగు రామన్న ఈ జిల్లాకి చెందిన వాడు కావడంతో అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గోనేందుకు మారుమూల ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

దీంతో మంత్రి భద్రత కోసం ఈ వాహనం కేటాయించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో పాటు డిప్యూటీ సీఎంలు రాజయ్య, మహుముద్ అలీ, హరీష్ రావుకు మాత్రమే ఇప్పటివరకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించారు.
దీంతో ఇప్పుడు జోగు రామన్నకు ఈ బుల్లెట్ ప్రూప్ వాహనం కేటాయించడంతో వీరి సంఖ్య ఇప్పుడు ఐదుకి చేరింది. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా మావోయిస్టు ప్రాబల్యం జిల్లాగా గుర్తింపు పొందింది.
జిల్లాలోని సిర్పూర్, వాంకిడి,, బెజ్జూర్, తిర్యాణి, నెన్నెల, కోటపల్లి, నీల్వాయి, భీమిని, చెన్నూర్ వంటి ప్రాంతాల్లో మావోయిస్టులు ప్రభావం అధిక సంఖ్యలో కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే కొమరం భీమ్ పుట్టిన పురిటిగడ్డ జోడేఘాట్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications