బుల్లెట్లతో శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడిన ప్రయాణికుడు
హైదరాబాద్: హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో ఓ వ్యక్తి వద్ద బుల్లెట్లు లభించడం సంచలనం రేపింది. హైదరాబాద్‌కు చెందిన జయరాం వైజాగ్ వెళ్లేందుకు మంగళవారం ఎయిర్‌పోర్టుకు వచ్చాడు.
ఆయన వెంట తెచ్చిన బ్యాగులో ఎనిమిది బుల్లెట్లు ఉన్నట్లు భద్రతాధికారులు తనిఖీలో గుర్తించారు. సీఐఎస్‌ఎఫ్ భద్రతా జవాన్లు వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఎయిర్‌పోర్టు భద్రతా నియమావళి మేరకు అలాంటి వస్తువులు తేవడం నిషేధం.

బుల్లెట్లు తన మిత్రుడు శ్రీనివాస్‌వని జయరాం చెప్పాడు. శ్రీనివాస్‌ను పిలిచి పోలీసులు విచారించగా వాటికి సంబంధించి అధికారిక పత్రాలు లేవని తేలింది. దీంతో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications