హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సరదా కోసం కాల్పులు: కటకటాలపాలైన వ్యాపారవేత్త(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆత్మరక్షణ కోసం తీసుకున్న తుపాకీని ఇష్టం వచ్చినట్లు వాడితే కటకటాల్లోకి వెళ్లక తప్పదని తెలిసింది ఓ వ్యాపారవేత్తకు. అకారణంగా సరదా కోసం గాల్లోకి కాల్పులు జరపడంతో సమాచారం అందుకున్న పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా కోదాడకు చెందిన వ్యాపారవేత్త పి ప్రభాకర్‌ గతంలో కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2014 ఆగస్టులో ఆత్మరక్షణ కోసమని 7.5 ఎంఎం పిస్టల్‌ను కొనుగోలు చేశారు.

కొంతకాలంగా హైదరాబాద్‌ శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్పాలగూడకు వచ్చి గ్రానైట్‌ క్వారీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి స్నేహితులతో కలిసి గండిపేటలోని ఓ రిసార్ట్స్‌లో అర్ధరాత్రి వరకూ విందులో పాల్గొన్నారు.

తిరిగి వెళ్తూ గండిమైసమ్మ గుడి దగ్గర రహదారిపై ఆగి స్నేహితులతో ముచ్చటిస్తూ సరదాగా గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం మంగళవారం పోలీసులకు చేరింది. దర్యాప్తు జరిపిన ఎస్‌వోటీ, నార్సింగి పోలీసులు.. నిందితుడు ప్రభాకర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

అతడి నుంచి పిస్టల్‌ను, మిగిలి ఉన్న రౌండ్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటన సమయంలో ప్రభాకర్‌తో పాటు ఉన్న గండిపేట సర్పంచి భర్త ప్రశాంత్‌ యాదవ్‌, నార్సింగి మాజీ సర్పంచి వెంకటేశ్‌ యాదవ్‌, మణికొండ మాజీ సర్పంచి తనయుడు అజయ్‌ బుగ్గోలు, ప్రభాకర్‌ స్నేహితులు శ్రీనివాస్‌, ప్రసాద్‌పై కూడా కేసులు నమోదు చేశారు.

మద్యం మత్తులో ఉన్న ప్రభాకర్ గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. అతని స్నేహితులు కూడా మద్యం సేవించి ఉన్నారని చెప్పారు. సరదా కోసమే కాల్పులు జరిపానని ప్రభాకర్ విచారణలో తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.

వ్యాపారి ఫొటో చూపుతున్న పోలీస్

వ్యాపారి ఫొటో చూపుతున్న పోలీస్

ఆత్మరక్షణ కోసం తీసుకున్న తుపాకీని ఇష్టం వచ్చినట్లు వాడితే కటకటాల్లోకి వెళ్లక తప్పదని తెలిసింది ఓ వ్యాపారవేత్తకు. అకారణంగా సరదా కోసం గాల్లోకి కాల్పులు జరపడంతో సమాచారం అందుకున్న పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

కాల్పులు జరిపి జైలుపాలయ్యాడు

కాల్పులు జరిపి జైలుపాలయ్యాడు

నల్గొండ జిల్లా కోదాడకు చెందిన వ్యాపారవేత్త పి ప్రభాకర్‌ గతంలో కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2014 ఆగస్టులో ఆత్మరక్షణ కోసమని 7.5 ఎంఎం పిస్టల్‌ను కొనుగోలు చేశారు.

తుపాకీ

తుపాకీ

కొంతకాలంగా హైదరాబాద్‌ శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్పాలగూడకు వచ్చి గ్రానైట్‌ క్వారీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి స్నేహితులతో కలిసి గండిపేటలోని ఓ రిసార్ట్స్‌లో అర్ధరాత్రి వరకూ విందులో పాల్గొన్నారు.

అరెస్ట్ చేసిన పోలీసులు

అరెస్ట్ చేసిన పోలీసులు

తిరిగి వెళ్తూ గండిమైసమ్మ గుడి దగ్గర రహదారిపై ఆగి స్నేహితులతో ముచ్చటిస్తూ సరదాగా గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం మంగళవారం పోలీసులకు చేరింది. దర్యాప్తు జరిపిన ఎస్‌వోటీ, నార్సింగి పోలీసులు.. నిందితుడు ప్రభాకర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

English summary
A Nalgonda businessman, who opened fire with his licensed gun for fun while drunk landed in jail on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X