వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

64 స్థానాలకు ఉప ఎన్నికలు : ప్రతిష్ఠాత్మకంగా మారుతున్న హుజూర్ నగర్..!

|
Google Oneindia TeluguNews

కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర..హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా 64 స్థానాలకు ఉప ఎన్నికలు షెడ్యూల్ ఖరారైంది. 18 రాష్ట్రాల్లోని 64 అసెంబ్లీ స్థానాలక ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇక, తెలంగాణలోని హుజూర నగర్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికకు సైతం షెడ్యూల్ ప్రకటించారు. అక్కడ ఇప్పుడు టీఆర్ యస్ నుండి గత ఎన్నికల్లో పోటీ చేసిన సైదిరెడ్డి తో పాటుగా శంకరమ్మ పోటీకి ఆసక్తి చూపుతున్నారు. అదే విధంగా కాంగ్రెస్ నుండి సైతం ఇదే సీటు కోసం పోటీ నెలకొని ఉంది. ఉత్తమ్ సతీమణికి మద్దతుగా సీనియర్ నేతలు జానారెడ్డి..కోమటిరెడ్డి నిలిచారు. కాగా.. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికి వద్దని..కొత్త వారికి అవకాశం ఇవ్వాలని మరి కొందరు కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. దీంతో...ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్న సమయంలో తాజాగా ఉప ఎన్నిక మరింత వేడి పెంచే అవకాశం కనిపిస్తోంది.

64 స్థానాలకు ఉప ఎన్నికలు
దేశ వ్యాప్తంగా 64 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ సునీల్‌ అరోరా ప్రకటించారు. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం అదే సమయంలో 64 స్థానాల్లో ఉప ఎన్నికల నిర్వహణకు సిద్దం అయింది. అరుణాచల్‌ ప్రదేశ్‌, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, అసోం, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మేఘాలయ, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్‌, రాజస్తాన్‌, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పలు స్థానాలకు అక్టోబరు 21న ఉప ఎన్నికలు జరుగుతాయని, అదే నెల 24న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు.

BY poll for 64 assembly seats in 18 sates including huzurnagar in Telangana

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 27న నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబరు 2న హర్యానా అసెంబ్లీ గడువు, మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబరు 9న ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది.. హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు, మహారాష్ట్రలోని 288 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 21న ఎన్నికలు.. అక్టోబర్ 24న ఫలితాలు వెల్లడికానున్నాయి.

హుజూర్ నగర్ సీటు కోసం పోటీ..
ఇక, తెలంగాణలోని నల్గొండ జిల్లా హుజూర్ నగర్ సీటు కోసం ఉప ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తం కుమార్ రెడ్డి లోక్ సభకు ఎన్నిక కావటంతో ఎన్నిక అనివార్యమైంది. ఆ స్థానంలో ఉత్తమ్ సతీమణి పద్మావతికి సీటు కేటాయించాలని ఉత్తమ్ తో పాటుగా జిల్లాకు చెందిన సీనియర్ నేతలు జానారెడ్డి..కోమటిరెడ్డి సిఫార్సు చేస్తున్నారు. అయితే..ముందుగానే అభ్యర్ధులను ఎవరికి వారు ఎలా ప్రకటిస్తారని కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

ఈ వ్యవహారం కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలకు కారణమైంది. దీని పైన ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది. అదే విధంగా అధికార టీఆర్ యస్ నుండి సైతం పోటీకి ఆశావాహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అధికార పార్టీ నుండి పార్టీ అధినేతకు సన్నిహితుడిగా..గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్దిగా పోటీ చేసిన సైదిరెడ్డి తిరిగి పోటీ చేసే అవకాశాలు ఎక్కువ గా కనిపిస్తున్నాయి. అయితే శంకరమ్మ పేరు ప్రచారంలో ఉంది. ఉప ఎన్నిక అనివార్యం కావటంతో అధికార పార్టీ ఇప్పటికే అక్కడ ముందస్తు వ్యూహాలు సిద్దం చేస్తోంది. మరో రెండు రోజుల్లో అభ్యర్దుల విషయం లో క్లారిటీ రానుంది.

English summary
BY poll for 64 assembly seats in 18 sates including huzurnagar in Telangana. Now aspirants coming out in Congress and TRS for ticket for this seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X