వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హుజూర్ నగర్ లో పోలింగ్ ప్రారంభం: బరిలో 28 మంది: కాంగ్రెస్ ..టీఆర్ఎస్ కు ప్రతిష్ఠాత్మకం..!

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో హుజూర్ నగర్ లో ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. అధికార టీఆర్ యస్ పార్టీకి..సిట్టింగ్ స్థానం కాపాడుకొనేందుకు కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ .. పీసీపీ చీఫ్ ఉత్తమ్ కు ఇది వ్యక్తిగతం ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ ఉప ఎన్నిక బరిలో 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 302 పోలింగ్ కేంద్రాలు.. 1708 ఈవీఎంలను ఏర్పాలు చేశారు. 1700 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉండగా.. 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 2,36,842 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం అయిదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను నియోజకవర్గంలో మొహరించారు.

పోలింగ్ ఆరంభం..

పోలింగ్ ఆరంభం..

హుజూర్ నగర్ లో ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవటంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో ఈ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుండి ఉత్తమ్ సతీమణి పద్మావతి కాంగ్రెస్ అభ్యర్దిగా బరిలో ఉన్నారు. కాగా, అధికార పార్టీ నుండి గత ఎన్నికల్లో ఓడిన సైదిరెడ్డి బరిలో నిలిచారు. అధికార..ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు ఈ ఉప ఎన్నికల ప్రతిష్ఠాత్మ కంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ పెద్ద ఎత్తున పార్టీ నేతలను మొహరించి వారికి గ్రామ స్థాయి నుండి బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా కాంగ్రెస్ నుండి కీలక నేతలు సుడిగాలి పర్యటన చేసారు . బీజేపీ..టీడీపీ అభ్యర్ధులు సైతం బరిలో ఉండటంతో పాటుగా మొత్తం 28 మంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. ప్రారంభమైన ఉప ఎన్నిక పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

2.36 లక్షల మంది ఓటర్లు..భారీగా పోలీసు సిబ్బంది

2.36 లక్షల మంది ఓటర్లు..భారీగా పోలీసు సిబ్బంది

నియోజకవర్గంలో ఉప ఎన్నిక రాజకీయంగా ప్రతిష్ఠాత్మకం కావటంతో అటు ఎన్నికల సంఘం ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఉప ఎన్నిక కోసం మొత్తం 302 పోలింగ్ కేంద్రాలు.. 1708 ఈవీఎంలను ఏర్పాలు చేశారు. 1700 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉండగా.. 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 2,36,842 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 79 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు గుర్తించిన అధికారులు.. ప్రతి పోలింగ్‌ కేంద్రంలోనూ సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి తన కార్యాలయం నుండి వెబ్ కాస్టింగ్ ను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసారు.

24న ఎన్నికల ఫలితాలు..

24న ఎన్నికల ఫలితాలు..

ఈ సాయంత్రం అయిదు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 24న కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే టీఆర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడ పార్టీ అభ్యర్ధి గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. పలువురు మంత్రులు అక్కడ ప్రచారం నిర్వహించారు. గ్రామ గ్రామాన బాధ్యతలను ఎమ్మెల్యేలకు కేటాయించారు. ముఖ్యమంత్రి సభ నిర్వహించాల్సి ఉన్నా..వాతావరణం అనుకూలించక రద్దు చేసారు. ఇక, టీడీపీ సైతం తమ బలం నిరూపించుకోవటానికి సిద్దం అయింది. ఎలాగైనా గట్టి పోటీ ఇస్తామని బీజేపీ చెబుతోంది. అధికార టీఆర్ య్..కాంగ్రెస్ మాత్రం గెలుపు మాదంటే మాదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం పోలింగ్ ముగిసిన తరువాత సరళి పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

English summary
By poll voting started in Huzurnager constituency. Total 28 candidates is in contest. 2.36 lakhs voters to be use thier vote. on 24th counting and results will be declared.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X