టెకీని వేధించిన క్యాబ్ డ్రైవర్.. కారులో అసభ్యంగా..
హైదరాబాద్ : క్యాబ్ డ్రైవర్ సహా సూపర్ వైజర్ ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే యువతి గట్టిగా ప్రతిఘటించడంతో.. ఇద్దరు నిందితులు అక్కడినుంచి పరారయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. మచ్చబొల్లారంలో నివాసం ఉండే ఓ వివాహిత హైటెక్ సిటీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. ఇదే క్రమంలో శుక్రవారం నాడు విధులు ముగించుకుని క్యాబ్ ద్వారా తన ఇంటికి బయలుదేరింది. అలా కారు మార్గమధ్యలో ఉండగానే.. క్యాబ్ డ్రైవర్ వేణుగోపాల్(37) సహా అందులోనే ఉన్న క్యాబ్ సూపర్ వైజర్ శ్రీకాంత్(25) ఇద్దరు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు.
అయితే యువతి గట్టిగా ప్రతిఘటించడంతో.. నిందితులిద్దరు పరారైనట్లు సమాచారం. అనంతరం షీ టీమ్ కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసిన ఉద్యోగిని.. ఇంటికి చేరుకున్న వెంటనే అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు నిందితుల కోసం గాలించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిద్దరిని విచారిస్తున్నట్లు సీఐ ఆనంద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications