తెలంగాణలో మంత్రివర్గం విస్తరణ కన్ఫార్మ్..? ఛాన్స్ దక్కించుకునేది వీరే ??
తెలంగాణలో గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా నడుస్తున్న మంత్రివర్గం విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తవుతుండగా.. 40వ సారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయణమయ్యారు. ఈ క్రమంలోనే ఉగాది సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు హస్తినకు వెళ్లారు. ముందుగా కేసీ వేణు గోపాల్ తో నేతలంతా సమావేశం కానున్నారు. దీంతో ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కొత్త కార్యవర్గం, నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వస్తుందని భావిస్తున్నారు.
భారత రాజ్యాంగం ప్రకారం, రాష్ట్ర క్యాబినెట్‌లో మంత్రుల సంఖ్య అసెంబ్లీ సభ్యుల మొత్తం సంఖ్యలో 15 శాతం ఉండాలి. ఈ ప్రకారం తెలంగాణలో 18 మందికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్‌లో 12 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులను ఈసారి అనౌన్స్ చేస్తారని పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ.. పదవుల పైన ఢిల్లీ నేతలు ప్రతిపాదనలు కోరగా రాష్ట్ర నేతలు సమర్పించారు. ఇప్పుడు ఆ పేర్ల పైన సామాజిక - ప్రాంతీయ సమీకరణాలతో కూర్పు దిశగా కసరత్తు పూర్తి అయ్యిందని సమాచారం.

అయితే ఇప్పుడు ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మేరకు మంత్రులుగా వీరికి ఛాన్స్ దక్కిందని విశ్వసనీయ వర్గాల ద్వారా వెల్లడవుతోంది. ఇప్పుడు కొత్తగా మంత్రి ఛాన్స్ దక్కే అవకాశం ఉన్న వారిలో 8 మంది పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్‌సాగర్ రావు ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గం గడ్డం వివేక్, అద్దంకి దయాకర్. బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి పేర్లు వినిపిస్తున్నాయి.
ఇక ఈసారి మంత్రివర్గంలో మైనారిటీ వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. మైనారిటీ కోటాలో పదవి కోసం అమీర్ అలీ ఖాన్ పేరును పరిశీలిస్తునట్టు చెబుతున్నారు. ఇక మహిళల కోటాలో విజయ శాంతికి అవకాశం ఇచ్చినట్టు కాంగ్రెస్ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications