వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంగళవారం సీఎం అధ్యక్షతన క్యాబినెట్ భేటీ.!లాక్‌డౌన్ పై కీలక నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశానికి రేపు అంటే మంగళవారం తెరపడబోతోంది. తెలంగాణలో కరోనా రెండవ దశ ప్రభావం తీవ్రంగా ఉండడమే కాకుండా కరోనా సోకిన వారు కూడా పిట్టల్లా రాలిపోతున్న సందర్బాలు చోటుచేసుకున్నాయి. ఆసుపత్రుల్లో అంతా అయోమయ పరిస్తితులు నెలకొనడంతో కరోనా రోగుల పరిస్దితి దయనీయంగా మారింది. ఇలాంటి తరుణంలో కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ అమలు చేయలనే డిమాండ్ కూడా తెరమీదకు వస్తోంది. లాక్‌డౌన్ పై ఎన్నో రోజుల నుండి ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Recommended Video

TS Corona Update: No Lockdown in Telangana లాక్ డౌన్ విధించే అవకాశం లేదు: CM KCR
తెలంగాణలో ఆగని కరోనా విజృంభణ.. పిట్టల్లా రాలిపోతున్న ప్రజలు..

తెలంగాణలో ఆగని కరోనా విజృంభణ.. పిట్టల్లా రాలిపోతున్న ప్రజలు..

తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజుకు సుమారు నాలుగు నుండి ఆరు వేల పాజిటీవ్ కేసులు నమోదవుతున్నయి. కరోనా లక్షణాలు వచ్చిన వారు చికిత్ప చేసుకుందామనుకుంటే ఆసుపత్రుల్లో పరిస్దితులు దారుణంగా తయారయ్యాయి. ఏ ఆసుపత్రిలో బెడ్లు ఉన్నాయో, ఏ ఆసుపత్రిలో వెంటిలేషన్ ఉందో, ఏ ఆసుపత్రిలో ఐసీయూ సౌకర్యం ఉందో, ఏ ఆసుపత్రిలో ఆక్సీజన్ ఉందో తెలియని అగమ్యగోచర సరిస్దితులు నెలకొన్నాయి. ఇక వ్యాక్సీన్, రెమిడిసివర్ ఇంజక్షన్ అందుబాటు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అవి ఎక్కడ దొరుకుతాయో, అసలు ధర కన్నా ఎంత అదనంగా ధరపెట్టి కొనాలో తెలియని పరిస్థితు నెలకొన్నాయి.

నైట్ కర్ప్యూ వల్ల ఫలితం అంతంతే.. పంజా విసురుతున్న కరోనా రెండవ దశ..

నైట్ కర్ప్యూ వల్ల ఫలితం అంతంతే.. పంజా విసురుతున్న కరోనా రెండవ దశ..

ఇలాంటి పరిస్ధితుల మధ్య పకడ్బంధీ చర్యలకు తెలంగాణ ప్రభుత్వం ఉపక్రమించబోతున్నట్టు తెలుస్తోంది. ఆసుపత్రుల పరిస్దితులు, ప్రజలు పిట్టల్లా రాలిపోయే సంఘటనలు, ప్రతిపక్షాల విమర్శలు, ఇలా అన్నీ అంశాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సమయానికే తెలంగాణలో లాక్‌డౌన్ విధించాలనే డిమాండ్ వినిపించింది. కాని కరోనా తీవ్రత అంతగా లేకపోడంతో ఆ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అంత ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కఠిన నిర్ణయం తీసుకోకతప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

మంగళవారం తెలంగాణ క్యాబినెట్.. లాక్‌డౌన్ పై సర్కార్ కీలక నిర్ణయం..

మంగళవారం తెలంగాణ క్యాబినెట్.. లాక్‌డౌన్ పై సర్కార్ కీలక నిర్ణయం..

ఇలాంటి విపత్కర సమయంలో పరిస్దితి పూర్తిగా చేయి దాటిపోకముందే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనున్నది. ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా ఈటల రాజేందర్ భూ ఆక్రమణలు, ప్రభుత్వ చర్యల గురించి చర్చించే అవకాశం ఉంది. తర్వాత రోజు రోజుకూ విజృంభిస్తున్న కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన కఠిన నిర్ణయాల గురించి కీలక చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

లాక్‌డౌన్ పై తొలగనున్న అపోహలు..మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్..

లాక్‌డౌన్ పై తొలగనున్న అపోహలు..మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్..

రాష్ట్రంలో లాక్‌డౌన్ విధింపు పై క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించడం ఒక్కటే కరోనా కట్టడికి సరైన మార్గం అని కూడా భావించి లాక్‌డౌన్ విధించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ విధింపుపై సాద్యాసాద్యలు పరిశీలించేందుకు రేపు మంత్రివర్గంలో కీలక చర్చ జరగబోతున్నట్టు తెలుస్తోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్ మంచి ఆయుధం అనే అభిప్రాయాలు మంత్రివర్గం నుండి వ్యక్తం అయితే మాత్రం ఖచ్చితంగా రంజాన్ పర్వదినం మరునాటి నుండి తెలంగాణలో మరోసారి సీఎం చంద్రశేఖర్ రావు లాక్‌డౌన్ విధిస్తారనే చర్చ జరుగుతోంది.

English summary
Though the cabinet has expressed the view that the lockdown is a good weapon for the Corona raising, there is talk that CM Chandrasekhar Rao will impose the lockdown once again in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X