యువకుడి దారుణ హత్య: ఇళ్లపై దాడులు, వాహనాల దగ్ధం, ఉద్రిక్తత

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలం పుస్పూర్ గ్రామంలో ఓ యువకుడి హత్య ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. గ్రామానికి చెందిన సంధే పంకజ్ పటేల్ (26) ఆదివారంనాడు దారుణ హత్యకు గురయ్యాడు. అతడి హత్యకు కారణమయ్యారంటూ గ్రామంలోని ఇద్దరి ఇళ్లపై పంకజ్ బంధువులు దాడికి దిగారు.

దాడిలో రెండు ఇళ్లతో పాటు, రెండు బైకులు ధ్వంసమయ్యాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపై మహిళలు దాడికి దిగారు. దీంతో పుస్పూర్ గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. ఇద్దరు డిఎస్పీలు, నలుగురు సిఐలతో సహా 30 మంది పోలీసులు గ్రామంలోకి దిగారు.

Cable operator murder create tension in Adilabad village

కొంత కాలంగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న పంకజ్ గత ఎంపిటిసీ ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. రాజకీయాల్లో స్థానిక సర్పంచ్ భర్త రాజేష్ బాబుతో అతడికి విభేదాలున్నాయి. తనకు సన్నిహితుడైన బుల్లోల రాజన్నతో పంకజ్‌ను రాజేష్ బాబు హత్య చేయించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

ఆదివారం రాత్రి చలి మంట కాచుకుంటున్న సమయంలో రాజన్న అకస్మాత్తుగా వచ్చి పంకజ్‌పై కత్తితో దాడి చేశాడు. భైంసా ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పంకజ్ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ సంఘటన గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+