వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రయివేట్ ఆసుపత్రులు అధిక బిల్లులు వేస్తే కాల్ చేయండి.!రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కరోనా వ్యాధిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దండుకుంటున్న ప్రయివేట్ ఆసుపత్రుల ఆగడాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుంబిగించినట్టు తెలుస్తోంది. కొద్దిపాటి చికిత్సకు లక్షల్లో బిల్లులు వేస్తూ, బిల్లు కడితేనే పేషెంట్ ను డిశ్చార్జీ చేస్తామని మొండిగా వ్యవహరించే ఆసుపత్రులపట్ల కొరడా ఝుళిపించేందుకు టాస్క్ ఫోర్స్ ప్రణాళికలరు రచిస్తోంది. ఏదైనా ఆసుపత్రిలో పేషెంట్ చనిపోతే పూర్తి బిల్లులు చెల్లిస్తేనే డెడ్ బాడీని ఇస్తామని మానవత్వం లేకుండా చెప్పడం వంటి చర్యలకు కూడా విజిలెన్స్ శాఖ చెక్ పెట్టనుంది.

 ఆగని ప్రయివేట్ ఆసుపత్రుల దోపిడి.. ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల..

ఆగని ప్రయివేట్ ఆసుపత్రుల దోపిడి.. ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల..

ప్రయివేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్లను కూడా జతచేసింది. ఏదైనా ప్రయివేటు ఆసుపత్రి యాజమాన్యం ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం కాకుండా వైద్య సౌకర్యాలకు అదనంగా ఛార్జీలు విధిస్తే వెంటనే కాల్ చేసి వివరాలు చెప్తే చర్యలు తీసుకునే వెసులుబాటు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. కరోనా బారిన పడిన పేషెంట్ల ఇప్పటికే ప్రయివేట్ ఆసుపత్రుల్లో లక్షల బిల్లులు కట్టలేక అనేక ఆర్ధిక సమస్యల్లో చిక్కున్నట్టు తెలుస్తోంది. అలాంటి వారికోసం ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.

 ప్రభుత్వం నిర్థారించిన ఛార్జీలనే అమలు చేయాలి.. ఒక్కరూపాయి అదనంగా వేసినా లైసెన్స్ రద్దు..

ప్రభుత్వం నిర్థారించిన ఛార్జీలనే అమలు చేయాలి.. ఒక్కరూపాయి అదనంగా వేసినా లైసెన్స్ రద్దు..

జిల్లాలలోని ఏ ప్రయివేట్ హాస్పిటల్ లో అయినా అధిక బిల్లులు వేస్తే వెంటనే ఈ ఫోన్ నంబర్లకు చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. అందుకు సంబంధించి తెలంగాణ ప్రభత్వం జీవోను కూడా జారీ చేరింది. తెలంగాణ ప్రభుత్వ జీవో నంబర్ 248 ప్రకారం ప్రయివేట్ హాస్పిటల్స్ వేయాల్సిన వివిధ ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి. ఒక రోజుకు వేయాల్సిన ఛార్జీల వివరాలు. 1) సాధారణ బెడ్ ఒకరోజుకు 4000 వేల రూపాయలు. 2) బెడ్ ఆక్సీజన్ తో కలిపి 6500 రూపాయలు. 3) వెంటిలేటర్ తో పాటు బెడ్ సౌకర్యం కలిపిస్తే 9000వేల రూపాయలుగా ప్రభుత్వం నిర్థారించింది.

 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యం.. ప్రయివేట్ ఆసుపత్రులపై స్టింగ్ ఆపరేషన్

టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యం.. ప్రయివేట్ ఆసుపత్రులపై స్టింగ్ ఆపరేషన్

ప్రభుత్వం నిర్ధారించిన ఛార్జీల కన్నా ఒక్క రూపాయి అదనంగా వేసినా ప్రయివేటు ఆసుపత్రుల తాట తీస్తామంటున్నారు విజిలెన్స్ అధికారులు. జిల్లాలలో అధిక బిల్లులు వేసి కోవిడ్ కరోనా పేషంట్లను దోచుకుంటున్న హాస్పిటల్స్ సమాచారం తమ దృష్టికి తీసుకువెళ్తే చర్యలు తీసుకుంటామంటున్నారు టాస్క్ ఫోర్స్ అధికారులు. టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడమే కాకుండా అధిక ఛార్జీలు వేస్తున్న ప్రయివేట్ ఆసుపత్రులపై స్టింగ్ ఆపరేషన్ చేసి మోసాలకు పాల్సడుతున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు.

 టాస్క్ ఫోర్స్ నంబర్లకు వివరాలు ఇవ్వండి.. ప్రయివేట్ దందాను నివారించండంటున్న విజిలెన్స్ అధికారులు

టాస్క్ ఫోర్స్ నంబర్లకు వివరాలు ఇవ్వండి.. ప్రయివేట్ దందాను నివారించండంటున్న విజిలెన్స్ అధికారులు

ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ నంబర్ల వివరాలు ఇలా ఉన్నాయి. సీఎం క్యాంపు ఆఫీస్ నెంబర్ : 04023403999. ఆరోగ్య శాఖకు సంబంధించి
డిఏంహెచ్ఓ సెల్ నెంబర్: 9705462662. ఆర్ డి ఓ సెల్ నెంబర్ : 7680906650. డీపీవో సెల్ నెంబర్ : 99491865049. డ్రగ్ ఇన్స్పెక్టర్ సెల్ నెంబర్ : 9704199455.
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ సెల్ నెంబర్ : 9849766789. అంతే కాకుండా అన్ని డయాగ్నస్టిక్ సెంటర్, ఆసుపత్రిలలో ఫల్మ్ తో పాటు చేసే స్కానింగ్ కు 2500 రూపాయలు, ఫిల్మ్ లేకుండా అయితే 2000 రూపాయలకే స్కానింగ్ జరగాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

English summary
It seems that the Telangana government has stepped in to curb the flow of private hospitals that are blocking corona disease.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X