Tg Sarpanch Elections : ప్రచారానికి ఎండ్ కార్డ్.. పోలింగ్ కోసం సన్నద్ధం !!
తెలంగాణ లోని పల్లెల్లో రాజకీయ వాతావరణం ఊపందుకుంది. రాష్ట్రంలో "పంచాయతీ పోరు"కి రంగం సిద్దమైంది. మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 189 మండలాల్లో 4,236 సర్పంచ్, దాదాపు 37 వేల వార్డులకు సంబంధించి ఎన్నికల జరగనున్నాయి. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లకు మార్గదర్శకాలు అందాయి. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహించారు. మొదటి విడతలో 37వేల 562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్, అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు.
ఇక ఇప్పటికే మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు ( డిసెంబర్ 11, 2025 ) ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. దాదాపు 56 లక్షల 19వేల 430 మంది ఓటర్లు ఓటు హక్కు నియోగించుకోనున్నారు. అందులో 27 లక్షల 41 వేల 70 పురుష ఓటర్లు.. 28 లక్షల 78 వేల 159 మంది మహిళా ఓటర్లు.. 201 ఇతరులు ఉన్నారు. ఎన్నికలు జరిగే జిల్లాల్లోని గ్రామ పంచాయితీల్లో నిన్న (డిసెంబర్ 9, 2025 మంగళవారం) సాయంత్రం 6 గంటల నుంచి రేపు ( డిసెంబర్ 11, 2025 ) సాయింత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు బంద్ చేయనున్నారు. మొదటి విడతలో 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.













Click it and Unblock the Notifications