శిరీషతో సహా అక్కడే ఎస్సై విందు: 'సిసిటివి ఫుటేజీ' అనుమానాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష, కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో నిందితులు శ్రవణ్ రాజీవ్‌లను జైలుకు తరలించారు. మరోవైపు, ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో దర్యాఫ్తు కొనసాగుతోంది.

శిరీష మరణం వెనుక మిస్టరీ.. డిజిపికి లేఖ: ఎక్కడో చంపి.. ఇక్కడే ఇన్ని అనుమానాలు?

ప్రతి కేసును సిసిటీవీ ఫుటేజీ ఆధారంగా ఛేదిస్తున్న పోలీసులు ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో సిద్దిపేట పోలీసులు సిసిటివిల ఫుటేజీలను అందజేయలేదనే మీమాంస అధికారులను సందిగ్ధపరుస్తోందని అంటున్నారు.

శిరీష, రాజీవ్, శ్రవణ్‌లతో అక్కడే ఎస్సై విందు

శిరీష, రాజీవ్, శ్రవణ్‌లతో అక్కడే ఎస్సై విందు

కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి తన క్వార్టర్‌లోనే శ్రవణ్, రాజీవ్, శిరీషలతో కలసి విందు చేసుకున్నాడు. అయితే పోలీస్ స్టేషన్, అక్కడి ప్రాంగణంలోనే ఉన్న క్వార్టర్‌లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడితే సిసిటివి ఫుటేజీలో తప్పకుండా రికార్టు అవుతుందని అంటున్నారు.

సిసిటివి ఫుటేజీ

సిసిటివి ఫుటేజీ

మరీ పోలీసులు సిసిటివి ఫుటేజీని ఎందుకు బహిర్గతం చేయడం లేదని ఎస్సై ప్రభాకర్ రెడ్డి బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సిసిటివిలో రికార్డయిన సంఘటన దృశ్యం టెక్నికల్ కారణాల వల్ల చూడలేకపోతున్నామని పోలీసులు చెప్పడం అనుమానం కలిగిస్తోందంటున్నారు. మొత్తానికి ఎస్సై ఆత్మహత్యలో సిసిటివి ఫుటేజీ ప్రధాన ఆధారంగా మారిందంటున్నారు.

వాంగ్మూలం తీసుకున్న పోలీసు బృందం

వాంగ్మూలం తీసుకున్న పోలీసు బృందం

మరోవైపు, శనివారం ఈ ఘటనపై నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ప్రత్యేక బృందాన్ని కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్‌కు పంపించారు. ఈ దర్యాప్తు బృందం కుకునూరుపల్లి చేరుకుని అక్కడి సిబ్బంది, ఎస్సై ప్రభాకర్ రెడ్డి గన్‌మెన్, డ్రైవర్‌లను సహ పలువురు కానిస్టేబుళ్ల వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

హైదరాబాద్‌కు సిపియు బాక్స్

హైదరాబాద్‌కు సిపియు బాక్స్

సిసిటివిల్లో సాంకేతిక లోపం రావడంతో సిపియు బాక్స్‌ను హైదరాబాద్‌కు తీసుకు వచ్చారు. సాంకేతిక నిపుణులచే ఈ సిపియు బాక్స్‌ను తెరిపించే ప్రయత్నాలు సాగుతున్నాయి.

హెడ్ క్వార్టర్స్‌కు ఏసిపి

హెడ్ క్వార్టర్స్‌కు ఏసిపి

ఇదిలా ఉండగా, సిద్దిపేట పోలీసుల నిర్లక్ష్యంపై సీరియస్‌గా తీసుకున్న డిజిపి అనురాగ్ శర్మ సిద్దిపేట ఏసిపి గిరిధర్‌ను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The mystery shrouding the death of Kukunoorpally police station sub-inspector (SI) P Prabhakar Reddy appears to have deepened further. Siddipet police claimed that the video footage of the CCTVs installed in the premises of their police station could not be retrieved due to ‘technical glitches.’
Please Wait while comments are loading...