వరిపై స్పష్టత ఇస్తారా.?జంతర్ మంతర్ లో జాతర చూస్తారా.?కేంద్రానికి కేసీఆర్ సూటి ప్రశ్న.!
ఢిల్లీ/హైదరాబాద్ : రాజకీయాల్లో తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు స్టైలే వేరు. కయ్యానికైనా వియ్యానికైనా ఓ సందర్బం ఉండాలని భావించే చంద్రశేఖర్ రావు వరి కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు హస్తినలో పాదంమోపారు. వరి కొనుగోలుపై కేంద్రం తన వైఖరి స్పష్టం చేయకపోతే తర్వాత కార్యాచరణపై దృష్టి కేంద్రీకరించారు చంద్రశేఖర్ రావు. ఒకవేళ వరి కొనుగోలుపై కేంద్రం సానుకూల స్పందన తెలపక పోతే ఈనెల 29న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యే రోజున ఢిల్లీలో గులాబీ శ్రేణులతో కలిసి ధర్నా చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు గులాబీ దళపతి. అదే 29వ రోజున మరో ప్రత్యేకత ఉందని గులాబీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో తాడో పేడో..ఢిల్లీలో ధర్నా యోచనలో సీఎం కేసీఆర్..
ఇదిలా ఉండగా వరి కొనుగోలుపై కేంద్రంతో తెలంగాణ పోరాటం అంతం కాదు ఆరంభం అంటున్నారు గులాబీ నేతలు. వరి ధాన్యం కొనుగోలుపై ఢిల్లీ పెద్దలతో తేల్చుకోవాలని, తర్వాత గులాబీ నేతల తడాఖా చూపించాలని గులాబీ నేతలు వ్యూహం రచిస్తున్నారు. అసలు వరి కొనుగోలు అంశంలో ఢిల్లీ పెద్దల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఢిల్లీలో చంద్రశేఖర్ రావు మకాం వేసినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆనాడు సిద్దిపేటలో చంద్రశేఖర్ రావు నిరాహార దీక్ష చేసిన రోజునే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని చంద్రశేఖర్ రావు కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది.

కేంద్రంతో ప్లాన్ ఏ ప్రకారం చర్చలు.. కుదరకపోతే ప్లాన్ బీ అమలు చేసేందుకు సై అంటున్న కేసీఆర్
యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య వైరం తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రత్యర్థిని రైతుల ముందు దోషిగా నిలబెట్టేందుకు ఇరు పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. రైతులను మోసం చేస్తుంది మీరంటే మీరే అని పరస్పర ఆరోపణలు చేసుకోవడమే కాకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీతో ఏదో ఒకటి తేల్చుకునేందుకుని గులాబీ దళపతి సిద్ధమవుతున్నట్లు గులాబీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రంతో తాడో పేడో తేల్చుకున్నాక, దేశంలో ప్రకంపనలు సృష్టించే కార్యక్రమం గులాబీ బాస్ చేపట్టబోతున్నట్టు గులాబీ నేతల్లో చర్చ జరుగుతోంది.

తెలంగాణలో అనేక సమస్యలు.. కేంద్రం పరిష్కారం చూపాలంటున్న గులాబీ బాస్..
టీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలందరూ ఢిల్లీలో మకాం వేసారు. ప్రధానంగా వరి కొనుగోలు, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, విభజన చట్టంలోని హామీలు, కేంద్రం నుండి రావాల్సిన నిధులు, తెలంగాణ ప్రాజెక్టలకు ఆర్థిక సాయం, కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించడం, బీసి జనగణన, ఎస్సీ వర్గీకరణ, కృష్ణ, గోదావరి జలాల వివాదం పరిష్కారంతో పాటు గిరిజనుల రిజర్వేషన్ కోటా పెంపుకు సంబందించిన అంశాలను కేంద్రపెద్దలతో చర్చించేందుకు రంగం సిద్దం చేసారు చంద్రశేఖర్ రావు. మరి ఈ అన్ని అంశాలు కాకుండా ప్రధానంగా వరి కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు గులాబీ నేతలు.

29 పార్లమెంట్ సమావేశాలు.. అదేరోజు దీక్ష దివస్.. జంతర్ మంతర్ లో జాతరే అంటున్న గులాబీ దళపతి
వరి కొనుగోలుపై కేంద్రం సానుకూలంగా లేకపోతే ఈ నెల 29న దీక్షా దివస్ సందర్భంగా సీఎం చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అదే రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నందున, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఇదే మంచి తరుణమని చంద్రశేఖర్ రావు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వరి ధాన్యం కొనుగోలు అంశమే ఈ పర్యటన ప్రధాన ఎజెండాగా మారనున్నట్లు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలుపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని, రాష్ట్ర బీజేపీ నేతల తీరును ఎండగట్టేందుకు ఢిల్లీ వేదికగా గుణపాఠం చెప్పాలని పార్టీ శ్రేణులకు చంద్రశేఖర్ రావు దిశా నిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications