జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం: 10మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వద్ద సోమవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. రహదారిపై వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లింది.
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వద్ద సోమవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. రహదారిపై వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పది మంది గాయపడ్డారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అపోలో నర్సింగ్‌లో శిక్షణ పొందుతున్న 15మంది నర్సింగ్ విద్యార్థినులు షేక్‌పేట నాలా సమీపంలో ఉన్న ఓ భవనం వద్ద వేచి ఉన్నారు. అదే సమయంలో అటువైపు వేగంగా వచ్చిన టీఎస్ 13యూఏ 6338 నంబర్ గల కారు అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లింది.
దీంతో కొందరు విద్యార్థినులు కేకలు పెడుతూ పరుగులు తీశారు. ఈ ఘటనలో 10మందికి పైగా విద్యార్థినులు గాయపడ్డారు. స్ధానికులు వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు నడుపుతున్న వ్యక్తి పరారయ్యాడు. నిందితుడిని పట్టుకునేందుకు సెక్టార్ ఎస్సై గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు.

బండ్లగూడలో విషాదం
బండ్లగూడలోని ఇంద్రప్రస్థకాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ లిఫ్ట్ మీదపడటంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది.
సిరిసిల్లలో విషాదం
సిరిసిల్లలోని రుద్రాంగిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా తల్లికి ఫిట్స్ రావడంతో ఆమె చేతిలో ఉన్న చిన్నారి బావిలో పడి మృతి చెందింది.












Click it and Unblock the Notifications