విషాదం: ఎమ్మెల్యే కారు ఢీకొని ఒకరు మృతి
మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్పూర్ మండలం పోతులమడుగు వద్ద ఎమ్మెల్యే కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. నియోజక వర్గంలో పర్యటనకు మంత్రి జూపల
మహబూబ్‌నగర్: జిల్లాలోని భూత్పూర్ మండలం పోతులమడుగు వద్ద ఎమ్మెల్యే కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. నియోజక వర్గంలో పర్యటనకు మంత్రి జూపల్లి కృష్ణారావు కారులో ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి కొత్తకోటకు వెళ్లారు. దారిలో డీజిల్ అయిపోవడంతో నింపుకొని వెళ్తున్న సమయంలో రోడ్డు దాటుతున్న వ్యక్తి ఎమ్మెల్యే కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో పోతులమడుగు గ్రామానికి చెందిన వెంకటయ్య (59) అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటయ్య మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications