రైల్ నిలయం వద్ద కారు బీభత్సం: దుకాణాలపైకి దూసుకెళ్లింది
హైదరాబాద్: తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంబేద్కర్‌నగర్ రైల్ నిలయం వద్ద బుధవారం ఓ కారు భీభత్సం సృష్టించింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ సంగీత్ నుంచి మెట్టుగూడవైపు వేగంగా వెళ్తున్న ఏపీ 07 టీఆర్ 1814 నెంబర్ గల కారు అదుపు తప్పి రైల్‌నిలయం పెట్రోల్‌బంక్ వద్ద ఫుట్‌పాత్‌పై దుకాణాలపైకి దూసుకెళ్లింది.
దీంతో పాన్‌డబ్బా, చెరుకుబండితో పాటు ఇతర దుకాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ఎవరి ప్రాణాలకు ముప్పువాటిల్లలేదు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

అనంతరం బాధిత దుకాణదారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం.
కాగా, కారు నడిపిన వ్యక్తిని బోరబండ మోతీనగర్ ప్రాంతానికి చెందిన యశ్వంత్(18)గా గుర్తించినట్లు తెలిసింది. అతడు మైనర్ కావడంతో పేరును చెప్పేందుకు పోలీసులు నిరాకరించినట్లు సమాచారం. మరో వ్యక్తి కూడా కారులో ఉన్నట్లు తెలిసింది. సీటు బెల్ట్ పెట్టుకున్న కారణంగా వారికి పెద్దగా గాయాలేమీ తగలనట్లు స్థానికులు చెప్పారు.












Click it and Unblock the Notifications