మందేసి, వేగంగా.. రాంగ్‌రూట్‌లో డ్రైవింగ్.. కారు-బైకు ఢీ
హైదరాబాద్‌లో తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. హైటెక్ సిటీ నోవాటెల్ వద్ద బైక్‌ను కారు ఢీ కొంది. ప్రమాదంలో యువకుడు మృతిచెందగా.. మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించి అతివేగంతో వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు.
మదాపూర్ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. వేగంగా వస్తోన్న బీఎండబ్ల్యూ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తోన్న బుల్లెట్ బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో బుల్లెట్‌పై ఉన్న అభిషేక్ ఆనంద్ తీవ్రంగా గాయపడ్డారు. అక్కడికక్కడే చనిపోయారు. మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బుల్లెట్‌ను ఢీ కొట్టిన కారు డ్రైవర్ కే అశ్విన్‌గా పోలీసులు గుర్తించారు. అతను డ్రింక్ చేశాడని పోలీసులు చెప్తున్నారు.

రాంగ్ రూట్‌లో నడపడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఈ ప్రమాదంలో బుల్లెటే కాదు.. కారు కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. వాటిని చూస్తే చాలు కారు ఎంత స్పీడులో ఉందో అర్థమవుతుంది. ఇటీవలే బయో డైవర్సిటీ నుంచి కారు బోల్తాపడటంతో ఓ మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ మరునాడే మరో ప్రమాదంలో మరో యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications