వరంగల్ అన్నారం దర్గా వద్ద కారు బీభత్సం.. భక్తుల మీదుగా దూసుకుపోయిన కారు!!
వరంగల్ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. వరంగల్ జిల్లా అన్నారం దర్గా వద్ద ఓ కారు అక్కడ భక్తులపైన ఒక్కసారిగా దూసుకుపోయింది . అక్కడితో ఆగకుండా ఓ దుకాణంలోకి దూసుకు వెళ్ళింది. ప్రశాంతంగా ఉన్న అన్నారం దర్గా వద్ద కారు బీభత్సం సృష్టించటంతో అక్కడి వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శుక్రవారం కావటంతో అన్నారం షరీఫ్ దర్గా వద్దకు భారీగా భక్తులు వచ్చారు. వారంతా ఘటనతో ఆందోళన చెందారు.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గా వద్ద కొత్తగా కొనుగోలు చేసిన కారును పూజ చేయించాలని తీసుకువచ్చిన వారు కారు అదుపుతప్పి ఒక్కసారిగా భక్తుల పైకి దూసుకు వెళ్ళింది. దీంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. గాయపడిన వారందరిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే భక్తుల పైకి కారు ఒక్కసారిగా దూసుకుపోవడంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు కారును డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి దేహ శుద్ధి చేశారు. కారును ధ్వంసం చేశారు.

వాహనాన్ని నడిపిన డ్రైవర్ కారును అతివేగంగా నడపడం, దానిని కంట్రోల్ చేయలేకపోవడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఒకసారిగా కారు జనాల మీదికి దూసుకుపోవడంతో అన్నారం దర్గా వద్దకు వచ్చిన భక్తులంతా ఆందోళనకు గురయ్యారు. కారును డ్రైవ్ చేసిన వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్ పర్వతగిరి మండలం అన్నారంలో కారు బీభత్సం..!! pic.twitter.com/YkuKwWLGt8
— oneindiatelugu (@oneindiatelugu) January 20, 2023












Click it and Unblock the Notifications