ఇంట్లో గంజాయి పెట్టించి: కిషన్ రెడ్డి ఫిర్యాదు, శ్రీధర్ బాబుపై కేసు నమోదు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబుపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఓడేడు మాజీ సర్పంచ్‌ కిషన్ రెడ్డి ఫిర్యాదుతో ఆయనపై ఎన్డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

చదవండి: ఐదుగురి ఆత్మహత్యలో కొత్తకోణం: సెల్‌ఫోన్లు మాయం, ప్రభాకర్ ఇంట్లో పోలీసుల సోదాలు

శ్రీధర్ బాబు, కిషన్ రెడ్డిల మధ్య గతకొంతకాలంగా వైరం ఉంది. దీంతో తన ఇంట్లో గంజాయి పెట్టి తనను గంజాయి కేసులో ఇరికించాలని శ్రీధర్ బాబు కుట్ర చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు.

Case against former minister Sridhar Babu

సుదర్శన్ అనే వ్యక్తి ద్వారా తన ఇంట్లో గంజాయి పెట్టించాలని శ్రీధర్ బాబు కుట్ర చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఆడియో టేపులు, ఇతర ఆధారాలను కిషన్ రెడ్డి పోలీసులకు ఇచ్చారని తెలుస్తోంది.

చదవండి: ఐదు మృతదేహాలు.. అనేక ట్విస్టులు: అసలేం జరిగింది?, ప్రభాకర్ రెడ్డి జీవితమిలా..

ఆయనకు ఆడియో టేపులు ఎలా వచ్చాయో తెలియాల్సి ఉంది. కిషన్ రెడ్డి ఫిర్యాదుతో శ్రీధర్ బాబుతో పాటు సుదర్శన్ పైన ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Case against former minister and Congress leader Duddilla Sridhar Babu in Chikkadapally police station.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి