వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిట్లర్ వ్యాఖ్య: లోకేష్‌పై కేసు, కేసీఆర్‌ని దించేయాలని

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పైన ఎల్బీనగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఇటీవల ట్విట్టర్లో లోకేష్ చేసిన వ్యాఖ్యల పైన తెరాస విద్యార్థి విభాగం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు. దీంతో, లోకేష్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదయింది.

మరోవైపు, లోకేష్ పైన జూనియర్ న్యాయవాదుల సంఘం రెండో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేసింది.

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ శాసనసభా పక్షం మంగళవారం నాడు రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలుసుకుని తెరాస ప్రభుత్వం అనుసరిస్తున్న పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి మాట్లాడుతూ దమ్ముంటే రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకోవాలని సవాల్ విసిరారు.

అడ్వోకేట్

అడ్వోకేట్

నారా లోకేష్ పైన తెలంగాణ జూనియర్ న్యాయవాదుల సంఘం రెండో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేసింది.

కాంగ్రెస్

కాంగ్రెస్

కాంగ్రెస్ శాసనసభా పక్షం మంగళవారం నాడు రాజ్ భవన్‌లో గవర్నర్‌ను, అలాగే శాసన సభాపతి మధుసూదనాచారిని కలుసుకుని తెరాస ప్రభుత్వం అనుసరిస్తున్న పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేసింది.

కాంగ్రెస్

కాంగ్రెస్

ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ దమ్ముంటే రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకోవాలని సవాల్ విసిరారు. స్పీకర్‌ను కలిసిన దృశ్యం

కాంగ్రెస్

కాంగ్రెస్

రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పదవికి అనర్హుడిగా ప్రకటించి, వెంటనే ఆ పదవి నుండి దించేయాలని తెలంగాణ కాంగ్రెస్ శాసన సభ్యులు డిమాండ్ చేశారు. సభాపతికి వినతిపత్రం ఇస్తున్న కాంగ్రెస్ సభ్యుల దృశ్యం.

కాంగ్రెస్

కాంగ్రెస్

సీఎం పదవిలో కొనసాగే నైతిక హక్కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్‌తో చెప్పారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

గవర్నర్‌ను కలిసిన వారిలో జానా రెడ్డి, జీవన్ రెడ్డి, గీతా రెడ్డి, రాంరెడ్డి వెంకట రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీకే అరుణ, కిష్టా రెడ్డి, దొంతి మాధవ రెడ్డి, సంపత్ కుమార్, పద్మావతి, సీ రామ్మోహన్ రెడ్డి, భాస్కర రావు, టీ రామ్మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

 కాంగ్రెస్

కాంగ్రెస్

కాంగ్రెస్ శాసనసభా పక్షం మంగళవారం నాడు రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలుసుకుని తెరాస ప్రభుత్వం అనుసరిస్తున్న పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేసింది.

 కాంగ్రెస్

కాంగ్రెస్

ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ దమ్ముంటే రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకోవాలని సవాల్ విసిరారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పదవికి అనర్హుడిగా ప్రకటించి, వెంటనే ఆ పదవి నుండి దించేయాలని తెలంగాణ కాంగ్రెస్ శాసన సభ్యులు రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కోరారు.

English summary
A case was registered against AP Chief Minister Chandrababu Naidu's son Lokesh for his tweet in which he allegedly compared Telangana Chief Minister Chandrasekhar Rao to Adolf Hitler, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X