విధ్వంసంపై ప్రభుత్వం సీరియస్: టీడీపీ ఎమ్మెల్యే సండ్ర సహా 11మందిపై కేసులు
ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డు విధ్వంసంలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య(ఏ2), కాంగ్రెస్ నేత ఆనందరావు(ఏ1) సహా 11 మందిపై కేసులు నమోదు అయ్యాయి.
ఖమ్మం: మార్కెట్ యార్డులో జరిగిన విధ్వంసంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డు విధ్వంసంలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య(ఏ2), కాంగ్రెస్ నేత ఆనందరావు(ఏ1) సహా 11 మందిపై కేసులు నమోదు అయ్యాయి.

తాను కేసులకు భయపడబోనని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తేల్చి చెప్పారు. రైతులకు మద్దతు ధర కల్పించకుండా భయభ్రాంతులకు గురిచేస్తోందని తెలంగాణ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.
కాగా, బాధిత మిర్చి రైతులను పరామర్శించిన కాంగ్రెస్ అధికార టీఆర్ఎస్‌పై మండిపడింది. మరో వైపు మిర్చి మద్ధతు ధర విషయంలో రాష్ట్రానిదే నిర్లక్ష్యమని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం కాంగ్రెస్ నేతలు మార్కెట్ యార్డును పరిశీలించినున్న నేపథ్యంలో అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు.












Click it and Unblock the Notifications