అశ్లీల చిత్రాలతో ప్రేమించమని బ్లాక్ మెయిల్: షూటింగ్‌లో పరిచయం..
పరిచయాన్ని ఆసరాగా చేసుకుని యువతిని బుట్టలో వేసుకోవాలని భావించాడు ఆసిఫ్.
హైదరాబాద్: ప్రేమ పేరుతో వెంటపడుతున్న ఓ యువకుడు.. యువతిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. తనను ప్రేమించకపోతే.. ఫోటోల్ని మార్ఫింగ్ చేసి బంధువులకు, స్నేహితులకు పంపిస్తానని బరితెగించాడు. యువతి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం హస్తినాపురంకు చెందిన ఓ యువతి(19)కి కొద్దిరోజుల క్రితం అమీర్‌పేటకు చెందిన ఆసిఫ్‌తో సినిమా షూటింగ్‌లో పరిచయం ఏర్పడింది. పరిచయాన్ని ఆసరాగా చేసుకుని యువతిని బుట్టలో వేసుకోవాలని భావించాడు ఆసిఫ్.

ప్రేమిస్తున్నానని చెప్పి పలుమార్లు ఫోన్ చేసి వేధించాడు. ఎంతకీ ఒప్పుకోకపోవడంతో యువతి ఫోటో మార్ఫింగ్ చేసి అశ్లీల చిత్రాలను అందరికి పంపిస్తానని బెదిరించాడు. బాధితురాలు స్థానిక ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించడంతో.. యువకుడిపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications