బాబువిగా చెప్తున్న ఆడియోపై ఈ వారమే!: మోడీకి చెప్పిన కేసీఆర్?
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో వచ్చే వారంలో కీలకమైన అంశాలు వెల్లడి కానున్నాయి. ఓటుకు నోటు వ్యవహారాన్ని ఏసీబీ విచారిస్తోన్న విషయం తెలిసిందే. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడినట్లుగా వచ్చిన ఆడియో గత వారం టేపులు బహిర్గతమయ్యాయి.
ఆడియో టేపులో ఉన్నది చంద్రబాబు గొంతేనా అని తెలుసుకునేందుకు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఇవి సోమవారం లేదా మంగళవారం వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబును బుక్ చేయాలనే ఉద్దేశ్యం, ఆరాటం చంద్రబాబులో బాగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి ఆడియో, వీడియో ఆధారాలు బయటకు వచ్చే ఆధారాలపై అందరిలోను ఉత్కంఠ నెలకొంది. ఇవి రానున్న రెండు మూడు రోజుల్లో బయటకు రావొచ్చు.
ఆడియో, వీడియో టేపుల్లో ఉన్న గొంతు చంద్రబాబుదేనని తేలితే ఏసీబీ అధికారులు ఆయనకు నోటీసులు పంపించుతారని చెబుతున్నారు. ఆ తర్వాత ఆయనను ప్రశ్నిస్తారు. ఓటు నోటు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే.

ప్రధానికి, హోంమంత్రికి ఓటుకు నోటుపై వివరించిన కేసీఆర్?
తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు ఓటుకు నోటు వ్యవహారం వివరాలు తెలిపినట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం కేసీఆర్ వారికి వివరించారని సమాచారం.
కాగా, కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేస్తోన్న విషయం తెలిసిందే. నల్గొండలో రెండు రోజుల క్రితం మాట్లాడుతూ.. చంద్రబాబు జైలుకు వెళ్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల్లో వాడిగావేడిగా మారింది.












Click it and Unblock the Notifications