ఉత్కంఠ: సండ్రకు బెయిలా? ఏసీబీ కస్టడీనా? నేడు ఏసీబీ కోర్డులో విచారణ
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు బెయిల్ లభిస్తుందా? లేక ఏసీబీ కస్టడీకి వెళతారా? అన్న ఉత్కంఠ నెలకొంది. ఓటుకు నోటు కేసులో సండ్ర కీలక నిందతుడని చెప్పిన ఏసీబీ అధికారుల వాదనతో ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఏబీసీ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

సండ్ర అరెస్టును నిరసిస్తూ ఆందోళన
ఓటుకు నోటు కేసులో అరెస్టైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు బెయిల్ లభిస్తుందా? లేక ఏసీబీ కస్టడీకి వెళతారా? అన్న ఉత్కంఠ నెలకొంది. ఓటుకు నోటు కేసులో సండ్ర కీలక నిందతుడని చెప్పిన ఏసీబీ అధికారుల వాదనతో ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఏబీసీ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

సండ్ర అరెస్టును నిరసిస్తూ ఆందోళన
వెంటనే ఆయన తనకు బెయిల్ మంజూరు చేయాలని ఏసీబీ కోర్డులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక రోజంతా ఏబీసీ అధికారులు విచారణ చేసిన తమ విచారణలో సండ్ర ఏ మాత్రం నోరు విప్పలేదని, డబ్బు ఎవరు ఇచ్చారనే అంశంతో పాటు, కుట్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉన్నందున ఆయన్ని ఐదు రోజుల పాటు తన కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సండ్ర అరెస్టును నిరసిస్తూ ఆందోళన
కస్టడీకి ఇవ్వాలన్న అభ్యర్థనపై సండ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రెండు పిటిషన్లను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు ఈరోజు వాటిని విచారించనుంది. ఈ రెండు పిటిషన్లను స్వీకరించిన ఏసీబీ కోర్టు ఆయా పిటిషన్లలో ప్రతివాదులుగా సండ్ర, ఏసీబీలకు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

సండ్ర అరెస్టును నిరసిస్తూ ఆందోళన
ఓటుకు నోటు కేసులో టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ మేరకు వరంగల్ జిల్లా జనగామలో పట్టణ కమిటీ ఆధ్వర్యాన 163వ నంబరు జాతీయ రహదారిపై అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు. సండ్రను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

సండ్ర అరెస్టును నిరసిస్తూ ఆందోళన
ఖమ్మం జిల్లాలో సండ్ర నియోజకవర్గం సత్తుపల్లి పరిధిలోని తల్లాడ, కల్లూరులో టీడీపీ నేతలు బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు వారి ప్రదర్శనను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కేంద్రమైన ఖమ్మంలోని జడ్పీసెంటర్‌లో మానవహారం, కారేపల్లిలో రాస్తారోకో, కొత్తగూడెంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం, మధిర, ముల్కలపల్లి, చండ్రుగొండల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
వెంటనే ఆయన తనకు బెయిల్ మంజూరు చేయాలని ఏసీబీ కోర్డులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక రోజంతా ఏబీసీ అధికారులు విచారణ చేసిన తమ విచారణలో సండ్ర ఏ మాత్రం నోరు విప్పలేదని, డబ్బు ఎవరు ఇచ్చారనే అంశంతో పాటు, కుట్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉన్నందున ఆయన్ని ఐదు రోజుల పాటు తన కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కస్టడీకి ఇవ్వాలన్న అభ్యర్థనపై సండ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రెండు పిటిషన్లను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు ఈరోజు వాటిని విచారించనుంది. ఈ రెండు పిటిషన్లను స్వీకరించిన ఏసీబీ కోర్టు ఆయా పిటిషన్లలో ప్రతివాదులుగా సండ్ర, ఏసీబీలకు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Click it and Unblock the Notifications