జగన్ దాడి: నోటుకు ఓటుపై కెసిఆర్ ఏం చేస్తారు?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తాను కుమ్మక్కయినట్లు తెలుగుదేశం పార్టీ దాడి చేస్తుండడంతో ఆత్మరక్షణలో పడినట్లు చెబుతున్నారు. దీంతో ఆయన టిఆర్ఎస్ తీరుపై మండిపడుతున్నారు. ప్రాజెక్టుల వ్యవహారంపై ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ, విమర్శలకు దిగారు. తెలంగాణ నీటి పారుదల మంత్రి హరీష్ రావు జగన్‌పై ఎదురుదాడికి దిగారు.
జగన్ వ్యవహారశైలిని జాగ్రత్తగా పరిశీలిస్తున్న కెసిఆర్ నోటుకు ఓటు వ్యవహారంలో ఏ విధమైన వైఖరి ఆవలంబించబోతున్నారు, కేంద్రం ఆయనకు ఏ విధమైన సందేశాలు పంపించిందీ అనే విషయాలు తెలియడం లేదు. సోమవారం ఆయన గవర్నర్ నరసింహన్‌ను కలుసుకున్నారు. అయితే, ఆయన గవర్నర్‌తో చేసిన సంభాషణల వివరాలు బయటకు రాలేదు.
నోటుకు ఓటు కేసులో కెసిఆర్ మెత్తబడుతారా అనే సందేహం కూడా కలుగుతోంది. నోటుకు ఓటు వ్యవహారంలో టిఆర్ఎస్ నుంచి విమర్శల జడివాన కూడా తగ్గుముఖం పట్టింది. ఆడియో, వీడియో టేపులు, మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించిన ఎసిబి కేసు విషయంలో ఎలా ముందుకు పోతుందనే విషయం కూడా అంతు చిక్కడం లేదు.

తన ప్రభుత్వాన్ని కూల్చడానికి చంద్రబాబు పెద్ద యెత్తున పథకం రచించారని తెలుసుకున్న కెసిఆర్ దాన్ని భగ్నం చేయడానికి పూనుకోవడం వల్లనే రేవంత్ రెడ్డి అరెస్టు దాకా వ్యవహారం వచ్చిందని అంటున్నారు. దానివల్ల రాజకీయంగా చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని అప్రతిష్ట పాలు చేయడంలో తాను చాలా విజయం సాధించానని కెసిఆర్ భావిస్తూ ఉండవచ్చు.
పరిస్థితిని గమనిస్తే రేవంత్ రెడ్డిపై కేసు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఎసిబి ఎలా వ్యవహరించబోతుందనేది తెలియడం లేదు. దొరికిన దొంగవంటూ చంద్రబాబును విమర్సించిన కెసిఆర్ ఆ తర్వాత ఆ వ్యవహారంపై ఏమీ మాట్లాడడం లేదు. చంద్రబాబును వదిలిపెట్టేది లేదంటూ కెసిఆర్ వ్యాఖ్యానించినట్లు ఇదివరకు వార్తలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుందీ, చేసుకుంటుందీ తెలియడం లేదు. దీంతో కెసిఆర్ ఎలా అడుగులు ముందుకు వేస్తారనే ఉత్కంఠ నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications