ఓటుకు నోటు: 'తెలంగాణ ఎసిబి వేధిస్తోంది', నివేదిక ఇవ్వమని హెచ్చార్సీ
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితుడు ఉదయ్ సిన్హా మంగళవారం నాడు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. తనను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు వేధిస్తున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్ పైన హెచ్చార్సీ స్పందించింది. ఈ నెల 13వ తేదీ లోపు తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎసిబి అధికారులను ఆదేశించింది.
కాగా, ఓటుకు నోటు కేసులో నిందితుడైన ఉదయ్ సిన్హా సోమవారం నాడు న్యాయస్థానంలో కూడా ఎసిబి అధికారుల పైన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

కేసులో రాజకీయ నేతలకు ప్రమేయముందని చెప్పమని ఏసీబీ అధికారులు తనను వేధిస్తున్నారని, తన పైన ఒత్తిడి తెస్తున్నారని ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న ఉదయ్ సిన్హా జడ్జికి ఫిర్యాదు చేశారు.
విచారణ పేరిట తనను వేధింపులకు గురి చేసిన ఏసీబీ అధికారులు, తాము చెప్పినట్లు వినాలని కూడా బెదిరిస్తున్నారని కోర్టుకు విన్నవించారు. ఏసీబీ అధికారుల వేధింపుల నుంచి తనకు విముక్తి కల్పించాలని జడ్జిని కోరారు.












Click it and Unblock the Notifications